మళయాలంలో సెకండ్ హయ్యొస్ట్ గ్రాసర్.. తెలుగులో..?

ఒక భాషలో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా మరో భాషలో అదే స్థాయి విజయం సాధించాలనేం లేదు.కనీసం ఆ రేంజ్ ఇంపాక్ట్ వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. అలాగని అసలు సాధ్యం కాదు అని కూడా చెప్పలేం. రీసెంట్ గా తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్ విరూపాక్ష తెలుగులో 100కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. బట్ ఇతర భాషల్లో రిలీజ్ చేస్తే రిలీజ్ ఖర్చులు కూడా రాలేదు.

ఇదంతా ఎందుకు అంటే.. ఇప్పుడు మళయాలం నుంచి మరో సినిమా తెలుగులో డబ్ అయింది.సినిమా పేరు 2018. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. అక్కడ బాగా ఫేమస్ అయిన టోవినోథామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్ తదితరులు నటించారు. అత్యంత తక్కువ బడ్జెట్ తోనే రూపొందిన ఈ చిత్రం కేరళ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఎంతలా అంటే ఏకంగా మాలీవుడ్ హిస్టరీలోనే సెకండ్ హయ్యొస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

దీనికంటే ముందున్న చిత్రం మోహన్ లాల్ నటించిన పులిమురుగన్.ఈ చిత్రం తెలుగులో మన్యంపులిగా డబ్ అయింది. మన్యంపులి అక్కడ 146కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తర్వాతి స్థానంలో 137.4 కోట్లతో ఈ 2018 చిత్రమే నిలవడం విశేషం. అంటే అక్కడి ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అర్థం అవుతోంది కదా. ఈ చిత్రాన్నే తెలుగులో డబ్ చేసి ఈ నెల 26న విడుదల చేస్తున్ఆనరు. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో ఉంటూ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ బాధ్యతలు చూసుకునే బన్నీ వాస్ ఈ మూవీని గీతా వారితో సంబంధం లేకుండా సొంతంగా విడుదల చేస్తుండటం విశేషం.


మామూలుగా మాలీవుడ్ మూవీస్ అన్నీ మనకు నచ్చవు.కొన్ని మాత్రం కాన్సెప్ట్ బేస్డ్ గా మెప్పిస్తాయి. ఈ చిత్రం కూడా కేరళ వరదల నేపథ్యంలో వచ్చింది. ఆ టైమ్ లో దేశ విదేశాల నుంచి కేరళకు కోట్ల రూపాయల సహాయం అందింది. అల్లు అర్జున్ కూడా కొంత అమౌంట్ డొనేట్ చేశాడు. తెలుగులో ఈ చిత్రం గురించి పెద్దగా తెలియదు అనే చెప్పాలి. అయినా పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే విడుదల చేస్తున్నారు. మరి అక్కడ సెకండ్ హయ్యొస్ట్ గ్రాసర్ గా నిలచిన 2018 తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Related Posts