టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారిన కొత్త జంట

కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ అయినప్పుడే ఆసక్తిని పెంచుతాయి. మంచి కంటెంట్ పడితే వారిది క్రేజీ కాంబో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరికొన్ని కాంబోస్ ఆరంభం నుంచే అంతా చర్చించుకునేలా ఉంటాయి. అలాంటిదే విజయ్ దేవరకొండ, శ్రీ లీల కాంబినేషన్. ఈ జంట ప్రధాన పాత్రల్లో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమా ప్రారంభం అయింది.

కొన్నాళ్లుగా విజయ్ కి సరైన సక్సెస్ లేదు. అయినా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మంచి ఛరిష్మా ఉన్న హీరోగా తెలుగులో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఇటు శ్రీ లీల అంటే చెంగున ఎగిరే లేడి కూనలా మారింది. పైగా అమ్మడు చేసిందల్లా హిట్టే అన్నట్టుగా మారింది. అందుకే ప్రస్తుతం గోల్డెన్ లెగ్ ఆఫ్ టాలీవుడ్ అనిపించుకుంటోంది. ఈ క్రేజ్ తోనే ఏకంగా తన బ్యాగ్ లో ఇప్పుడు తొమ్మిది సినిమాలున్నాయి. ఈ రేంజ్ లో ఆఫర్స్ ఉన్న బ్యూటీ టాలీవుడ్ లోనే కాదు.. ఇండియాలోనే ఇప్పుడు మరో హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ తొమ్మిదిలో ఏ నాలుగు బ్లాక్ బస్టర్ అయినా అమ్మడిని పట్టుకోవడం కష్టమే.


ఇక సితార బ్యానర్ లో సినిమా ఓపెనింగ్ అయిన దగ్గర్నుంచీ అందరి కళ్లూ విజయ్ దేవరకొండ, శ్రీ లీల కాంబినేషన్ పైనే ఉండటం విశేషం. మళ్లీరావా తర్వాత నానితో చేసిన జెర్సీ మూవీతో గౌతమ్ తిన్ననూరి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో తీశాడు కానీ మ్యాజిక్ రిపీట్ కాలేదు. అయినా అతని సత్తా తెలిసిన రామ్ చరణ్ ఓ ఆఫర్ ఇచ్చాడు.

ఆ అవకాన్ని ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు గౌతమ్. తను చెప్పిన కథ చరణ్ కు నచ్చలేదు. ఇప్పుడు అదే స్టోరీని కాస్త మార్పులు చేసి విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు అంటున్నారు. చరణ్ తో చేస్తే లార్జ్ స్కేల్ లో ఉండేదే. అయినా సితార వాళ్లు కూడా ఏ మాత్రం తగ్గకుండా గౌతమ్ అడిగిందంతా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ప్రారంభంతోనే క్రేజీ కాంబినేషన్ అనిపించుకుంటోన్న విజయ్ దేవరకొండ, శ్రీ లీల వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Related Posts