కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకున్నా ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్

ఆస్కార్.. సినిమావారికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డ్. ఒక్కసారి ఆస్కార్ సాధిస్తే చాలు.. వారి జన్మ ధన్యమైనట్టుగానే భావిస్తారు. కొన్నాళ్ల క్రితం వరకూ ఇండియాలాంటి దేశాలకు ఇది అందని ద్రాక్ష. కానీ ఇప్పుడు కాదు. గతంలో మన వారికీ అవార్డులు వచ్చాయి. కానీ ఇంత ప్రాచుర్యం లేదు. ఇక లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఆస్కార్ కోసం దేశమంతా ఎదురుచూసింది. ఈ సినిమాకు ఆస్కార్ రావాలని భాషలకతీతంగా ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు సైతం ఈ సారి ఆస్కార్ ఇండియాదే అన్నారు. అంతా కోరుకున్నట్టుగానే తెలుగు సినిమాకు ఇండియన్ సినిమాగా ఆస్కార్ వచ్చేసింది. అయితే ఈ చిత్రానికి పోటీగా కేంద్ర ప్రభుత్వం మరో సినిమాను నిలిపింది అన్న విషయం ఈ సందర్భంగా చాలమంది మర్చిపోయినట్టున్నారు.

నిజానికి ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ ను ప్రభుత్వం తరఫున పంపించలేదు. ఈ చిత్రానికి బదులుగా గుజరాత్ రాష్ట్రంలో రూపొందిన ‘‘చెల్లో షో’’ చిత్రాన్ని ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. అందుకు కారణమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మోదా రాష్ట్రం నుంచి వచ్చిన కాబట్టి ఆ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని చూశారు. బట్ అది ఆల్రెడీ వేరే దేశంలో వచ్చిన చిత్రానికి అనుకరణ అని అప్పుడే జనం తేల్చారు. ఈ కారణంగానే ఈ చెల్లో షో అనే చిన్న చిత్రం వేరే ఏ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు.. అవార్డులు తెచ్చ�