శిష్యుడు తర్వాత గురువుతో రామ్ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మార్చి నుంచే ఈ సినిమా పట్టాలెక్కనుందట. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందేది రామ్ చరణ్ 16వ చిత్రం. ఇక.. 16వ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో ఉండగానే తన 17వ సినిమాకి సంబంధించిన కసరత్తులు ప్రారంభిస్తున్నాడట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.

చరణ్ తన 17వ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సరికొత్త రామ్ చరణ్ ని ఆవిష్కరించాడు సుకుమార్. చరణ్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఎప్పటికీ ‘రంగస్థలం’ది ప్రత్యేకమైన స్థానం. మరోవైపు ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ ఆల్రెడీ విజయ్ దేవరకొండతో ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. కానీ.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం ఉంది. దీంతో.. ‘పుష్ప’ సిరీస్ తర్వాత సుకుమార్.. రామ్ చరణ్ చిత్రం స్క్రిప్ట్ పనులను మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Related Posts