HomeMoviesటాలీవుడ్'పుష్ప 2' ట్రైలర్: 2 నిమిషాల 44 సెకన్ల మ్యాడ్‌నెస్!

‘పుష్ప 2’ ట్రైలర్: 2 నిమిషాల 44 సెకన్ల మ్యాడ్‌నెస్!

-

‘పుష్ప 2’ ట్రైలర్ మ్యానియాకి మరొక రోజు మాత్రమే ఉంది. రేపు సాయంత్రం పాట్నా వేదికగా భారీ స్థాయిలో ‘పుష్ప 2’ ట్రైలర్ ను లాంఛ్ చేయబోతుంది టీమ్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ లెంత్‌ పై క్లారిటీ ఇచ్చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ‘పుష్ప 2’ ట్రైలర్ 2 నిమిషాల 44 సెకన్ల పాటు ఉండబోతుందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ట్రైలర్ చాలా ఐకానిక్ గా ఉండబోతుందని.. మీరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. అంతకు మించే ట్రైలర్ ఉంటుందని హింట్ ఇచ్చింది మైత్రీ సంస్థ.

అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘పుష్ప 2’ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న విడుదలకాబోతున్న ఈ మూవీని చూసేందుకు టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ బుక్ మౌ షో, పేటిఎమ్ లలో 1 మిలియన్ ఇంట్రెస్ట్స్ వచ్చాయి. ఆల్ అప్‌కమింగ్ ఇండియన్ మూవీస్ లో ఇదే హయ్యస్ట్. మొత్తంగా.. మరికొద్ది గంటల్లోనే విడుదలకానున్న ‘పుష్ప 2’ ట్రైలర్‌లోని మ్యాడ్‌నెస్‌ను అనుభవించడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి

English News