Pawan kalyan : ఇద్దరు హీరోయిన్లతో పవన్ కళ్యాణ్ సయ్యాట..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమా అంటేనే మాగ్జిమం గ్యారెంటీ. కంటెంట్ తో పనిలేకుండా టికెట్స్ తెగుతాయి. అందుకే ఆయన కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా నిర్మాతలు వెనకాడరు. పైగా పవన్ కు ఇష్టమైన సినిమాలంటే మాత్రం వెంటనే డేట్స్ కూడా ఇస్తాడు. అందువల్ల అప్పు చేసినా వెంటనే రిలీజ్ ఉంటుంది కాబట్టి.. ఎక్కువగా వడ్డీలు లేకుండా పనవుతుందని భావిస్తారు నిర్మాతలు.

అందుకే అతని లేటెస్ట్ మూవీ ”బ్రో” కోసం ఏకంగా మూడు కోట్లకు పైగా ఖర్చుపెట్టైనా సరే.. ఓ స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ చేయించాలనుకుంటున్నారు. కాకపోతే ఆ బ్యూటీ మరీ ఓవర్ గా కోట్ చేసిందట. దీంతో పవన్ తో కెరీర్ నే మార్చుకున్న బ్యూటీ అయితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. మరి ఈ ఇద్దరు భామల్లో పవన్ తో స్పెషల్ సాంగ్ లో మెరిసేది ఎవరు.. అసలా బ్యూటీస్ ఎవరు..?


సముద్రఖని దర్శకత్వంలో సాయితేజ్ తో కలిసి పవన్ నటించిన సినిమా బ్రో. తమిళ్ లో మంచి విజయం సాధించిన వినోదాయసీతమ్ కు ఇది రీమేక్. ఆల్రెడీ షూటింగ్ చివరికి వచ్చేసింది. పవన్ కు సంబంధించి ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉంది. ఆ సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీతో చేయించాలనుకున్నారట.

కానీ తను ఏకంగా నాలుగు కోట్ల వరకూ డిమాండ్ చేసిందని టాక్. నిర్మాతలు మూడు కోట్ల వరకూ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా అమ్మడు అదేం కుదరదు అని చెప్పిందంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌ తో గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటించి హిట్ పెయిర్ అనుకున్న శ్రుతి హాసన్ తో ఈ స్పెషల్ సాంగ్ చేయించాలనుకుంటున్నారు అనేది కొత్త టాక్.

శ్రుతి అయితే రెండు కోట్ల లోపే అయిపోతుంది. పైగా కాంబినేషన్ క్రేజ్ కూడా కలిసొస్తుంది. అనుకుంటున్నారట. మరి ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య సయ్యాటలాడుతున్న ఈ ఐటమ్ సాంగ్ లో పవన్ తో కలిసి మెరిసేది ఎవరో చూడాలి.

Related Posts