మెగా కాంపౌండ్ లోకి పలాస దర్శకుడు

పలాస 1978 మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు కరుణ కుమార్. పలాస ప్రాంతంలోని ఆ కాలపు రాజకీయ, సామాజిక సమస్యలను అద్భుతంగా చిత్రించాడు. అటు కమర్షియల్ గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో అందరి దృష్టీ అతనిపై పడింది. ఆ వెంటనే సుధీర్ బాబు హీరోగా సినిమా చేసే అవకాశం వచ్చింది. శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ కూడా ఓ సోషల్ ఇష్యూను డిస్కస్ చేసింది.

బట్ కమర్షియల్ గాఅస్సలు వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత అంతా చిన్నవారితో కళాపురం అనే చిత్రం తీశాడు. ఇదీ పోయింది. దీంతో ఇక కరుణ కుమార్ కథ ముగిసింది అనుకున్నారు. బట్ అతను స్వతహాగా కథకుడు. అందుకే మరో మంచి కథతో ఈ సారిఏకంగా మెగా కాంపౌండ్ లోకే అడుగుపెట్టబోతున్నాడు.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు ఆల్రెడీ వరుణ్ తేజ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఆగస్ట్ తర్వాత నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందట.

వరుసగా రెండు ఫ్లాపుల తర్వాత కూడా కరుణ కుమార్ కథ ఓకే కావడంలో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే.. ఈ మూవీ కూడా పలాస లాగా ఓ పీరియాడిక్ డ్రాగా వస్తోందంట. ఇందులోనూ ఓ బలమైన సామాజిక సమస్యనే కథా వస్తువువగా తీసుకున్నాడట కరుణ కుమార్. ఈ పాయింట్ నచ్చడం వల్లే వరుణ్ తేజ్ ఓకే చెప్పాడు అంటున్నారు.


ప్రస్తుతం వరుణ్ తేజ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఇది షూటింగ్ చివరి దశలో ఉంది. తర్వాత శక్తి ప్రతాప్ సింగ డైరెక్షన్ ఓ భారీ ప్యాన్ ఇండియన్ మూవీ కూడా చేస్తున్నాడు.

ఈ చిత్రం ఈ యేడాదే స్టార్ట్ అవుతుందంటున్నారు. మొత్తంగా వరుణ్ తేజ్ గని ఫ్లాప్ తర్వాత కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. మరి ఈ అడుగులు అతన్ని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయా లేదా అనేది చూడాలి.

Related Posts