మరోసారి రెచ్చిపోయిన ‘యానిమల్‘ బ్యూటీ

‘యానిమల్‘ సినిమాతో హీరోయిన్ గా రష్మిక కు ఎంత పేరొచ్చిందో.. అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది త్రిప్తి డిమ్రి. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, త్రిప్తి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఒకానొక దశలో ఆ కెమిస్ట్రీ శృతి మించిందనే కామెంట్స్ వినిపించాయి. అయినా.. త్రిప్తికి ఆఫర్ల వర్షం కురిసింది. ఈ లిస్టులో త్రిప్తి నుంచి వస్తోన్న సినిమా ‘బ్యాడ్ న్యూస్‘.

అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియారా అద్వానీ కామెడీ మూవీ ‘గుడ్ న్యూస్‘కి స్పిరిచ్యుయల్ సీక్వెల్ గా ‘బ్యాడ్ న్యూస్‘ రూపొందింది. ఈ మూవీలో విక్కీ కౌశల్, అమ్మీ వర్క్ హీరోలుగా నటించగా.. త్రిప్తి హీరోయిన్ గా నటించింది. జూలై 19న విడుదలకు ముస్తాబైన ‘బ్యాడ్ న్యూస్‘ నుంచి లేటెస్ట్ గా ‘జానమ్‘ అంటూ సాగే గీతం విడుదలైంది. రొమాంటిక్ గా తెరకెక్కిన ఈ పాటలో ‘యానిమల్‘ బ్యూటీ అందాల విందు చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.

Related Posts