ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ తో నాగ చైతన్య..

భారీ హిట్స్ లేకపోయినా.. తనదైన శైలి విజయాలతో దూసుకుపోతోన్న హీరో నాగ చైతన్య. ఆ మధ్య వరుసగా మూడు నాలుగు హిట్స్ అందుకున్నాడు. ఆ విజయాలన్నీ మర్చిపోయేలా చేసింది థ్యాంక్యూ సినిమా. దీంతో పాటు బాలీవుడ్ డెబ్యూగా చెప్పుకున్న లాల్ సిగ్ చద్దా కూడా పోయింది.

దీంతో ప్రస్తుతం ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో కస్టడీ చిత్రంతో వస్తున్నాడు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. బంగార్రాజు తర్వాత చైతూ సరసన క్రుతి శెట్టి మరోసారి హీరోయిన్ గా నటించిన సినిమా ఇది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు చైతూ. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత అతను పరశురామ్ తో సినిమా చేస్తాడు అని భావించారు చాలామంది. బట్ అందుకు భిన్నంగా ఓ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే మోస్ట్ ప్రామిసింగ్ అని చెబుతారు. ఆ బ్యానర్ కు సెకండ్ లీడ్ గా వచ్చింది గీతా ఆర్ట్స్2. బన్నీ వాస్ నిర్మాణ సారథ్యంలో ఈ బ్యానర్ లో సినిమాలు వస్తున్నాయి. నాగ చైతన్య నెక్ట్స్ ప్రాజెక్ట్ ను బన్నీ వాసే నిర్మించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోందట. ఈ చిత్రానికి రీసెంట్ గా కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న చందు మొండేటి దర్శకుడు. ఆల్రెడీ చందు – చైతూ కాంబినేషన్ లో గతంలో ప్రేమమ్ సినిమా వచ్చింది.

Shruti Haasan, Naga Chaitanya in Premam Movie Latest Stills

మళయాల ప్రేమమ్ కు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ తెలుగులోనూ మంచి విజయం సాధించింది. బట్ ఆ తర్వాత వీరు చేసిన సవ్యసాచి మాత్రం డిజాస్టర్ అయింది.

సవ్యసాచి తర్వాత చందు బ్లడీ మేరీ అనే కంటెంట్ ను ఆహా ఓటిటికోసం డైరెక్ట్ చేశాడు. అప్పటి నుంచే గీతా కాంపౌండ్ తో పరిచయాలున్నాయన్నమాట. ఆ పరిచయాలతోనే ఇప్పుడు చైతన్యతో మరోసారి సినిమాకు సిద్ధం అవుతున్నాడు.ఇప్పటికే కథ వినిపించారు.

చైతూ కూడా దాదాపు కన్ఫార్మ్ చేసినట్టే అంటున్నారు. కాకపోతే చిన్న చిన్న మార్పులున్నాయట. కస్టడీ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ క్లియర్ అప్డేట్ వస్తుంది. మరి ఈ చిత్రాన్ని కూడా కార్తికేయ2లా ప్యాన్ ఇండియన్ మూవీగా చేస్తారా లేక లోకల్ మూవీగానే రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

Related Posts