లేట్ అయినా లేటెస్ట్ గా అనే మాట ఇండస్ట్రీలో తరచూ వింటుంటాం.. బట్ వీళ్లు మాత్రం లేట్ అయింది. అందుకే సెన్సేషనల్ గా వస్తాం అంటున్నారట. ఇంతకీ వీళ్లెవరూ అనేకదా మీ డౌట్. ఇంకెవరూ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంటే కొరటాల శివతో సినిమానే కదా అని డిజప్పాయింట్ అవుతున్నారా..? బట్ కాదు. సో.. ఇంక ప్రశాంత్ నీల్ సినిమా గురించే కదా.. దానికి చాలా టైమ్ ఉంది.. ఇప్పుడెందుకూ అనే ఫీలింగ్ కూడా వస్తుందేమో.. అది కూడా కాదు. అంతకు మించి అనలేం కానీ.. ఆల్రెడీ అనౌన్స్ అయి ఆగిపోయిన కాంబినేషన్ నుంచి ఎవరూ ఊహించని బ్యాక్ డ్రాప్ లో సినిమా రాబోతోందనే వార్తలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. ఆ స్ట్రాంగ్ అనే మాటకు కారణం నిర్మాతే చెబుతుండటం. మరి ఈ కాంబో ఏంటీ.. ఏ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది..?


ఆర్ఆర్ఆర్ తర్వాత సరైన ప్లానింగ్ చేసుకోలేదు ఎన్టీఆర్ అనేది ఆడియన్స్ తో పాటు ఆయన ఫ్యాన్స్ లో కూడా కనిపించింది ఓ ఫీలింగ్. బట్ మీసాలు కూడా రాకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన అతనికి తెలియదా ఎప్పుడు ఏం చేయాలో అనేది కూడా మనం మరో రకంగా అనుకోవచ్చు. పైగా మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా తిరుగులేని క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు. ఇక ఆ టాలెంట్ ను సినిమా సినిమాకు పెంచుతూ.. నెక్ట్స్ లెవల్ కు వెళ్లడమే ఇప్పుడు అతని ముందున్న లక్ష్యం. అందుకోసం అందర్లా కాకుండా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ వెళ్లాలి.

కేవలం మాస్ ను మాత్రమే పట్టుకుంటే టాలీవుడ్ కు బాస్ అవడం కష్టం. అందుకే తనకు మాత్రమే పట్టు ఉన్న.. తను మాత్రమే చేయగలిగిన జానర్ మైథాలజీ. ఈ జానర్ లో సినిమా చేయాలంటే నందమూరి హీరోల తరవాతే ఎవరైనా అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఇక యమదొంగ చిత్రంలో కాసేపు యముడుగా కనిపించిన షేక్ చేశాడు ఎన్టీఆర్. ఇక పూర్తి స్థాయిలో మైథాలజీ మూవీ చేస్తే ఎలా ఉంటుంది. అది కూడా ఏ యముడు లాంటి పాత్ర కాకుండా.. ఏ రాముడుగానో, కృష్ణుడుగానో కనిపిస్తే.. తాతను మరిపిస్తాడు అని చెప్పలేం కానీ మరోసారి ఆ లెగసీ తమకే సొంతం అని మాత్రం నిరూపించగలడు అనొచ్చు. ఇప్పుడు కొరటాల శివతో సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ లో మూవీ ఉంటుంది కదా.

ఈ రెండూ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్స్. ప్రశాంత్ నీల్ సినిమా అయితే ఇప్పటి వరకూ ఎన్టీఆర్ ను చూడనంత మాస్ గా చూపించబోతున్నాడట. ఆ తర్వాత సినిమా విషయంలో లేటెస్ట్ గా ఓ క్లారిటీ వచ్చింది. అది కూడా నిర్మాత నాగవంశీ వల్ల. సితార బ్యానర్ అధినేతగా అందరికీ తెలిసిన నాగవంశీ మామూలుగానే ఎన్టీఆర్ కు వీరాభిమాని. అందుకే ఆయనతో తమ బ్యానర్ లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మైథాలజీ తీయాలనుకుంటున్నాం అని రీసెంట్ గా చెప్పాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తోనే చేయాల్సి ఉంది. కథ సెట్ కాలేదు. బట్ లేట్ అయినా సెన్సేషనల్ గా అన్నట్టుగా ఈ కాంబినేషన్ లో ఓ మైథాలజీ మూవీకి ప్లాన్ చేస్తున్నారు. అన్నట్టు మన పురాణాల మీద త్రివిక్రమ్ కు కూడా తిరుగులేని పట్టు ఉంది కాబట్టి.. నిజంగా వీళ్లు ఆ పౌరాణిక కథ చేస్తే.. బాక్స్ లు బద్ధలే అవుతాయోమో.

, , , , , , , , , , ,