సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా టైటిల్ కి సంబందించి రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఈ చిత్రానికి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఫిక్స్ చేసారు అన్నారు. తర్వాత కాదు అనే మాటలు వినిపించాయి.

మల్లి ఆ టైటిల్ కి త్రివిక్రమ్ ఒకే చెప్పాడు అనే టాక్స్ వినిపించాయి. ఇక లేటెస్ట్ గా ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ టైటిల్ కూడా అమరావతికి దగ్గరగానే ఉండటం విశేషం. అయితే ఒకటి కాదు ఏకంగా మూడు టైటిల్స్ ను అనుకుంటున్నారట. ఈ మూడూ కూడా గుంటూరు అనే పేరుతోనే ఉండటం మరో విశేషం.


మహేష్ బాబు సరసన పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్ నిర్మిస్తోంది. ఇంతకూ ముందు మహేష్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మూవీస్ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదు.

దీంతో ఈ హ్యాట్రిక్ మూవీ పై ఇద్దరు చాల నమ్మకంగా ఉన్నారు. కాకపోతే ఈ మూవీ షూటింగ్ సజావుగా సాగడం లేదు. ఇప్పుడు కూడా షెడ్యూల్ గాప్ లో ఉంది. మహేష్ వకాషన్ లో ఉన్నాడు. అక్కడి నుంచి రాగానే మల్లి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ లోగా టైటిల్ ఫిక్స్ అయితే ఈ నెల ౩౧న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఒక వీడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.

మరి కొత్తగా వినిపిస్తోన్న ఆ టైటిల్స్ ఏంటో తెలుసా..
గుంటూరు కారం” , ” గుంటూరు అబ్బాయి“, ” గుంటూరు మిర్చి ” ఇవీ ఇప్పటికి అనుకుంటున్న టైటిల్స్. మరి వీటిలో ఏది ఫైనల్ అవుతుందో కానీ
మహేష్ మాత్రం గుంటూరు ను వదిలేది లేదు అన్నట్టుగా ఉన్నాడట. కృష్ణ గారి ఊరు కూడా తెనాలి దగ్గర ఉన్న బుర్రిపాలెం. అప్పట్లో అది గుంటూరు జిల్లాలో ఉంది. మరి ఆ కారణమా లేక కథకు తగ్గట్టుగానా అనేది తెలియదు కానీ .. అయితే అమరావతి లేదంటే గుంటూరు లో ఒక టైటిల్ ఫిక్స్ అవుతుంది అని మాత్రం చెబుతున్నారు.

, , , , , , , , , , ,