కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప’ టీజర్

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోన్న మూవీ ‘కన్నప్ప’. మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ నుంచి టీజర్ రాబోతుంది. అందుకు ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదిక కాబోతుంది. ఈనెల 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా టీజర్ ను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

‘కేన్స్‌ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించనుండటం చాలా ఆనందంగా ఉందని.. ప్రపంచ ప్రేక్షకులకు మేము ఎంతో ఇష్టంగా రూపొందించిన ‘కన్నప్ప’ను ప్రదర్శించడానికి కేన్స్‌ అనువైన వేదికగా ఉపయోగపడుతుందని విష్ణు తెలిపాడు.

ఈ సినిమాలో ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Posts