సుకుమార్ విషయంలో నాని అన్నదాంట్లో తప్పేముందీ.. ?

సుకుమార్.. డౌట్ లేకుండా టాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్. కెరీర్ ఆరంభంలో క్లాస్ మూవీస్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు సుకుమార్. పూర్వం తను లెక్కల మాస్టర్ కావడంతో తన స్క్రీన్ ప్లే లో కూడా.. ఆ లెక్కలు పక్కాగా కనిపించేవి. బట్ మాస్ ఆడియన్స్ కు ఈ లెక్కలు అర్థం కావు కదా. అందుకే సుకుమార్ రంగస్థలంకంటే ముందు టాప్ డైరెక్టర్ అనే హోదా లేదు.. అనేది నిజం. రంగస్థలం కూడా రామ్ చరణ్ తో చేయడం వల్ల మాస్ డైరెక్టర్ గా మారాడు. అంతకు ముందు ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో తీసినా.. ఇది పూర్తిగా ఇల్లాజికల్ గా కనిపించే కథ, కథనం. కాకపోతే ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ డిఫరెంట్ మేకోవర్ తో కనిపించడం.. అతని డ్యాన్సులు, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కలిసి సినిమాను హిట్ చేశాయి.

అయితే రంగస్థలం సుకుమార్ స్టైల్ కు భిన్నమైనది. టేకింగ్ నుంచి మేకింగ్ వరకూ.. స్టోరీ టెల్లింగ్ తో పాటు స్క్రీన్ ప్లే వరకూ కొత్తగా కనిపించడంతో బ్లక్ బస్టర్ అయింది. అయినా సుకుమార్ రంగస్థలం వరకూ తెలుగు దర్శకుడు మాత్రమే.. అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అంశం. ఇక పుష్ప తర్వాతే అతని స్థాయి దేశవ్యాప్తంగా పెరిగింది. అయినా నిజం మాట్లాడితే.. ఈ మూవీకి అల్లు అర్జున్ కు వచ్చినంత ఫేమ్ సుకుమార్ కు రాలేదు. కాకపోతే ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను మెప్పించాడు కాబట్టి.. తన స్పాన్ కూడా కాస్త పెరిగింది అనుకోవచ్చు. ఇదే మాట దసరా మూవీ ప్రమోషన్స్ లో చెప్పాడు నాని. మరి అతను చెప్పినదాంట్లో తప్పేముందీ..?


ఈ నెల 30న నాని, కీర్తి సురేష్ నటించిన దసరా మూవీ విడుదలవుతోంది.ఈ చిత్రం కూడా ప్యాన్ ఇండి యన్ మూవీనే. అందుకే నాని కాలికి బలపం కట్టుకుని దేశవ్యాప్తంగా తిరుగుతూ.. ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కొత్త దర్శకుడిని నమ్మి ప్యాన్ ఇండియన్ సినిమా ఎలా చేస్తారు అని కొందరు ప్రశ్నించారు. అప్పుడు నాని సుకుమార్ ను ఉదాహరణగా చూపిస్తూ.. పుష్పకు ముందు వరకూ సుకుమార్ కూడా తెలుగు దర్శకుడే. ఇప్పుడు ప్యాన్ ఇండియన్ వరకూ తెలిశాడు.

ఇక దసరా దర్శకుడు శ్రీకాంత్ ఈ మూవీ ముందు వరకూ తెలుగుకూ కొత్తే.. తర్వాత అందరికీ పరిచయం అవుతాడు అంతే తేడా.. అన్నాడు. దీంతో నాని .. సుకుమార్ ను అవమానించాడు అంటూ కొత్త పాట ఎత్తుకున్నారు కొందరు. బట్ నిజం ఒప్పుకునే ధైర్యం ఉంటే నాని మాట్లాడింది తప్పు కాదు అని అర్థం అవుతుంది. ఎందుకంటే సుకుమార్ తెలుగులో ఎంత తోపు దర్శకుడైనా.. పుష్పకు ముందు వరకూ ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు పెద్దగా తెలియదు కదా..? సో.. నాని మాట్లాడిన దాంట్లో తప్పు ఏముందో అనేవారికే తెలియాలి.

Related Posts