‘కల్కి‘ కోసం రూపొందిన ఫ్యూచర్ గన్స్

గత కాలానికి సంబంధించిన సినిమాలు తీయాలంటే.. ఆయా కాలాలకు సంబంధించిన పరిస్థితులను అవగతం చేసుకుంటే సరిపోతుంది. కానీ.. భవిష్యత్ కి సంబంధించిన సినిమా అంటే ప్రతీది కొత్తగా సృష్టించాల్సిందే. ఇప్పుడు ‘కల్కి 2898 ఎ.డి.‘ కోసం అదే పనిలో ఉన్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. 2898వ సంవత్సరంలో జరిగే కథగా రూపొందుతోన్న ఈ సినిమాకోసం ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నాడు.

అప్పటి మనుషులు, వారి ఆచార వ్యవహారాలు దగ్గర నుంచి.. వారు వాడే కార్లు, గన్స్ వంటి వాటిని కూడా ఎంతో వైవిధ్యంగా డిజైన్ చేస్తున్నాడు. ఈ సినిమాకోసం ఆమధ్య ఎలాంటి కార్లు.. వాటి టైర్లకు సంబంధించి ఓ మేకింగ్ వీడియోని వదిలారు. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఉపయోగించే గన్స్ పై స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది టీమ్. ఊహకు అందనిరీతిలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన ఈ ఫ్యూచరిస్టిక్ గన్స్ వైవిధ్యంగా ఉన్నాయి.

Related Posts