బాలయ్య సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘భగవంత్ కేసరి’ సినిమాతో భారీ హిట్ సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలను అందుకుంటున్న బాలయ్య, ఇదే క్రమంలో ప్రస్తుతం తన 109వ సినిమాలో నటిస్తున్నారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ జోష్ లో బాలయ్య ‘భగవంత్ కేసరి’ సక్సెస్ జోష్ లో ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే, తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని, ఆ ఇద్దరిలో ఒకరు త్రిష కృష్ణన్ మరొకరు మీనాక్షి చౌదరీ. వీరిని మేకర్స్ ఫైనల్ చేశారని ఈ వార్త సారాంశం. త్రిష ఇటీవల తమిళంలో విజయ్ సరసన ‘లియో’ మూవీలో నటించి మంచి హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత కమిటైన లేటెస్ట్ ప్రాజెక్ట్ NBK 109 అని సమాచారం.

ఇక మీనాక్షి చౌదరి కూడా వరుసగా తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో నటిస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ లోనూ క్లైమాక్స్‌లో మెరవబోతుందట. ఈ క్రమంలోనే బాలయ్య మూవీలో కూడా అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి నిజంగానే బాలయ్య-బాబీ మూవీలో త్రిష, మీనాక్షి నటిస్తున్నారనే విషయం మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తేగానీ ఓ క్లారిటీ వస్తుంది.

ఇది నిజమేనా..?

త్రిష ప్రస్తుతం సౌత్‌లో ఏ సినిమా చేయాలన్నా దాదాపు 10 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ‘జవాన్’ తర్వాత నయనతార భారీగా రెమ్యునరేషన్ పెంచిందనీ.. అందుకే, నిర్మాతలు పాన్ ఇండియన్ సినిమాకి త్రిష ని ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే బాలయ్య మూవీ పాన్ ఇండియన్ రేంజ్ కాదు కాబట్టి త్రిషని తీసుకునే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ త్రిష ఫైనల్ అయితే ఆమెకి 10 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం కూడా అయ్యే పని కాదు అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. చూడాలి మరి NBK 109 లో హీరోయిన్స్ ఎవరు ఫిక్స్ అవుతారో.

Related Posts