విరూపాక్ష విషయంలో అంతా తూఛ్ అంటున్నారే..

సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది విరూపాక్ష సినిమా. హీరోయిన్ సంయుక్త పాత్ర అత్యంత కీలకంగా.. తన నటన కూడా హైలెట్ గా ఉన్న ఈ మూవీకి మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కార్తీక్ దండు డైరెక్షన్ లో రూపొందిన విరూపాక్షను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. 25 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే 75 కోట్ల వరకూ కలెక్ట్ చేసి కొన్నవాళ్లందరికీ లాభాలపంట పండించింది.

ఈ మధ్య కాలంలో మసూద తర్వాత వచ్చిన సాలిడ్ హారర్ థ్రిల్లర్ గా ఆడియన్స్ అందరి చేతా అనిపించుకున్న ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని ఆ మధ్య సోషల్ మీడియాలో చెప్పాడు సాయిధరమ్ తేజ్. బట్ పరిస్థితులు చూస్తోంటే అది సాధ్యం కాదేమో అనిపిస్తోంది.


విరూపాక్ష లాంటి చిత్రానికి సీక్వెల్ రాయడం అంటే స్క్రిప్ట్ మీద సాములాంటిది. ఫస్ట్ పార్ట్ లోనే అనేక ట్విస్ట్ లు, థ్రిల్స్, అస్సలే మాత్రం ఊహించలేని సంఘటనలు ఉన్నాయి. అందుకే బ్లాక్ బస్టర్ అయింది. మరి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అంటే అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా..? అంటే మొదటి భాగం కంటేబలమన కథ, కథనాలు సెట్ కావాలి. అది అనుకున్నంత సులువు కాదు. అయినా క్లైమాక్స్ లో డిఫరెంట్ లుక్ తో కనిపించి సీక్వెల్ కు లీడ్ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. అందుకే రెండో భాగం ఉంటుందనుకున్నారు. బట్.. ప్రొడక్షన్ హౌస్ వెర్షన్ మాత్రం సీక్వెల్ కు అనుకూలంగా లేకపోవడం విశేషం.

రీసెంట్ గా ఈ మూవీ సీక్వెల్ గురించి వారి దగ్గర ప్రస్తావిస్తే.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏం లేదు అని చెప్పారు. అలాగని అస్సులు లేదు అనలేదు. ఒకవేళ మంచి కథ కుదిరి అంతా బావుంది అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాం అని చెప్పారు. అంటే ఇప్పటికైతే ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించిన పనులు అంటూ ఏం జరగడం లేదు. కేవలం ఇతర భాషల్లో మాత్రం రిలీజ్ చేస్తున్నారు. అంతే. మరి సాయితేజ్ చెప్పిన మాటను కూడా నిర్మాణ సంస్థ పట్టించుకోవడం లేదా లేక సాయితేజ్ కూడా క్యాజువల్ గా సీక్వెల్ ఉంటుందని చెప్పాడా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే సీక్వెల్ మేటర్ తూఛ్ అనుకోవాల్సిందే.

Related Posts