Vijay Antony : దుమ్మురేపిన బిచ్చగాడు-2

విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటించిన సినిమా బిచ్చగాడు2. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో అది కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది అనుకున్నారు. కానీ 2016లో వచ్చిన బిచ్చగాడు బ్లాక్ బస్టర్ ప్రభావం నుంచి తెలుగువాళ్లు ఇంకా బయటకు రాలేదు.

అందుకే ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఎంత అంటే మణిరత్నం డైరెక్షన్ లో కోలీవుడ్ హేమాహేమీలు నటించిన పొన్నియన్ సెల్వన్ కంటే ఎక్కువగా. యస్.. పొన్ని సెల్వన్ రెండు భాగాల్లో ఏదీ బిచ్చగాడు2కు పోటీ ఇవ్వలేదు. అందుకే ఈ మధ్య వచ్చిన ఏ తమిళ్ సినిమాకూ ఇంత పెద్ద ఓపెనింగ్స్ రాలేదు ఆ రేంజ్ లో అదరగొట్టాడు బిచ్చగాడు2.

బిచ్చగాడు2 మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4. 5 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ఏ సినిమా కూడా తెలుగులో ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేదు. వరుసగా ఫ్లాపులే చూశాడు. దీనికి తోడు ఈ సీక్వెల్ కు మిక్స్ డ్ టాక్ రావడంతో బిచ్చగాడు2 బాక్సాఫీస్ దగ్గర పోయినట్టే అని భావించారు.

బట్ అందరి అంచనాలకు భిన్నంగా బిచ్చగాడు2 బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి. ఈ వీకెండ్ కు మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. అటు తమిళనాడులో కూడా భారీ ఓపెనింగ్స్ నే తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఏదేమైనా కొన్ని ట