ఓటిటిలోకి దసరా

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయం అయిన ఈ మూవీ మార్చి 30న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఆడుతోంది. నాని కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఈ టైప్ క్యారెక్టర్ చేయడం. సింగరేణి కాలరీస్ నేపథ్యంలో సాగే ఈ కథలో అతను కెరీర్ ఎప్పుడూ లేని విధంగా చాలా రగ్గ్ డ్ గా కనిపించాడు. కీర్తి సురేష్ సైతం డీ గ్లామర్ రోల్ లో అదరగొట్టింది.

దర్శకుడుగా శ్రీకాంత్ కు చాలా మంచి పేరు తెచ్చిందీ చిత్రం. నానికి ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ కూడా కావడం విశేషం. కాకపోతే ప్యాన్ ఇండియన్ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది దసరా. అయితే ఓవర్శీస్ లో మాత్రం అదరగొట్టింది. ఏకంగా టూ మిలియన్ డాలర్స్ వసూలు చేసి సత్తా చాటింది.

మామూలుగా నానికి ఓవర్శీస్ లో మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ను మరింత పెంచింది దసరా.
ఇక ఈ మధ్య ఇలా విడుదలైైన సినిమాలు అలా థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. బట్ హిట్ టాక్ వస్తే మాత్రం రూల్స్ ప్రకారం వస్తున్నారు. అలా నాని దసరా మూవీ కూడా ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయింది.

ఈ నెల 27 నుంచి అన్ని భాషల్లోనూ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఏ సినిమా అయినా విడుదలైన నాలుగు వారాల వరకూ ఓటిటిలో రిలీజ్ చేయకూడదు అనే రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఈ మూవీకి నాలుగు వారాలు ముగియగానే స్ట్రీమ్ చేస్తాం అని నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించింది. సో.. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు ఇంట్లో కూర్చొనే ఈ మాస్ ఎంటర్టైనర్ ను ఎంజాయ్ చేయొచ్చన్నమాట.

Related Posts