ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో ” కే” అంటే ఏంటో తెలుసా..?

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమాల లిస్ట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ప్యాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉంది. ఆ ఇమేజ్, రేంజ్ లేని హీరోలు ఒకటీ రెండు సినిమాలు చేయడానికే నానా తంటాలు పడుతోన్న తరుణంలో ప్రభాస్ మాత్రం ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ యేడాదే రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో ఆదిపురుష్‌ జూన్ 16న విడుదల కాబోతోంది. ఈ మూవీ రామాయణ ఇతిహాస నేపథ్యంలో వస్తోందని గతంలో వచ్చిన టీజర్ చూస్తే తెలిసింది. అయితే ఆ టీజర్ వల్లే సినిమా ఆలస్యం అయింది.

విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ను మళ్లీ చేయిస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ సలార్. ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇంకా చెబితే ఆదిపురుష్ పై అభిమానుల్లో కూడా ఆసక్తి లేదు అనేది నిజం. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే మూవీ కూడా షూటింగ్ లో ఉంది. వీటన్నటికీ మించి చేస్తోన్న బిగ్ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే.


వైజయంతీ మూవీస్ బ్యానర్ 50వ సంవత్సరంలో చేస్తోన్న సినిమాగా ఈ మూవీ రాబోతోంది. అశ్వనీదత్ అల్లుడు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకథపై రకరకాల రూమర్స్ ఉన్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనేది ఎక్‌కువమంది చెబుతోన్న మాట. అయితే ఈ టైటిల్ లో ఉన్న కే అనే అక్షరానికి అర్థం కూడా రకరకాలుగా వినిపిస్తోంది.బట్ అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కే అనే పదం మహా భారతం నుంచి తీసుకున్నారు అంటున్నారు. భారతంలోనే కాదు..

ఈ దేశంలోని ఇతిహాసాలన్నిటిలోనూ దానం చేయడంలో గ్రేటెస్ట్ అనిపించుకున్న వ్యక్తి కర్ణుడు. అతని పేరు నుంచే కే అనే అక్షరాన్ని తీసుకున్నారట. అంటే కర్ణుడు లాంటి వ్యక్తి మళ్లీ ఈ వర్తమానంతో పాటు భవిష్యత్ లో కూడా ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ చుట్టూ ఈ కథ ఉంటుందట. సింపుల్ గా చెబితే.. తను జీవించిన ఓ కాలంలో ఒకరికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఈ కర్ణుడు మళ్లీ జన్మిస్తాడు. అప్పటికే సమాజం చాలా చాలా ముందుకు వెళ్లి ఉంటుంది.

అయినా తన మాటను నిలబెట్టుకునేందుకు కాలంతోనే పోరాటం చేసే మహా యోధుడుగా ప్రభాస్ కనిపిస్తాడు అనేది ఇన్ సైడ్ సోర్స్ చెబుతోన్న మాట. దీని ప్రకారం చూస్తే ఆ కర్ణుడు అనే వ్యక్తిని తమ కాలంలోకి రాకుండా అనేక దుష్టశక్తులు అడ్డు పడుతుంటాయట. వాటిని దాటి తన మాట నిలబెట్టుకునే ఆధునిక కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు.. అదే ప్రాజెక్ట్ కే అనే టైటిల్ కు అర్థం అంటున్నారు. మరి ఈ మాటలో నిజమెంతో కానీ.. కే అనే అక్షరం మాత్రం ఖచ్చితంగా కర్ణుడునే సూచిస్తుందని చెబుతున్నారు చాలామంది.

Related Posts