డిసెంబర్ లోనే అల్లు అర్జున్ ‘పుష్ప 2’

అనుకున్నదే జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ ‘పుష్ప 2’ వాయిదా పడింది. ఆగస్టు 15న రావాల్సిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘పుష్ప 2’ ప్రస్తుతం ఇండియా నుంచి రాబోతున్న మోస్ట్ ఏంటిసిపేటెడ్ ఫిల్మ్ అని చెబుతూనే.. ‘పుష్ప 1’ భారీ విజయం సాధించడంతో ‘పుష్ప 2’పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయని.. ఆ అంచనాలకు మించిన రీతిలో తమ టీమ్ వర్క్ చేస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

ఇంకా మిగిలి ఉన్న షూట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాకపోవడం వలనే ఆగస్టు 15కి ‘పుష్ప 2’ని తీసుకురాలేకపోతున్నామని ప్రకటించింది. అయితే.. సినిమాని వాయిదా వేయడం వెనుక అసలు కారణం.. బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావడమేనని తెలిపింది మైత్రీ సంస్థ. ఇప్పటివరకూ వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని.. సినిమా కంటెంట్ కూడా అందరినీ అబ్బురపరిచే విధంగా ఉండబోతుందని హింట్ ఇచ్చింది.

మొత్తంమీద.. ‘పుష్ప 1’.. 2021, డిసెంబర్ లో రిలీజయ్యింది. అంటే.. దాదాపు ఈ మూడేళ్ల సమయంలో ‘పుష్ప 2’ పూర్తికాకపోవడానికి కారణం ఏంటి? అనుకున్నట్టుగా అవుట్ పుట్ రాలేదా?.. రీ షూట్స్ ఎక్కువగా చేయడం వలనే.. సినిమా ఆలస్యమవుతుందా? అనే ఊహాగానాలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. మరోసారి డిసెంబర్ లో ఐకాన్ స్టార్ మళ్లీ ఫుల్ స్వాగ్ తో ‘పుష్ప’రాజ్ గా సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయడం ఖాయమనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి.

Related Posts