అల్లు అర్జున్ మిస్.. రామ్ చరణ్‌ యస్ అంటాడా.?

కొత్త కాంబినేషన్స్ సెట్ అవుతున్నప్పుడు కొత్తదనం ఉంటుందని అంతా భావిస్తారు. కానీ కొన్నిసార్లు అవి కథల దశలోనే ఆగిపోతాయి. అలాంటిదే రామ్ చరణ్‌ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్. మళ్లీరావాతో దర్శకుడుగా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ గా వేసి, జెర్సీతో అద్భుతమైన సినిమా అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అతని మేకింగ్ స్టైల్ కు చాలామంది స్టార్ హీరోలు ఫిదా అయ్యారు. అందుకే రామ్ చరణ్ కూడా అతని డైరెక్షన్ లో చేయాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగా గౌతమ్ అప్పట్లోనే ఓ లైన్ చెప్పాడు. ఆ లైన్ నచ్చడంతో దాదాపు ఈ ప్రాజెక్ట్ ఓకే అనుకున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పారు. అయితే గౌతమ్ తీసిన హిందీ జెర్సీ అక్కడ పెద్దగా మెప్పించలేకపోయింది. ఆ ఫ్లాప్ ప్రభావం పడిందో లేక ఇంకేదైనా రీజన్ ఉందో కానీ రామ్ చరణ్‌ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ ఏమంత బాలేదని చెప్పారు. రీసెంట్ గా చరణ్ కు పూర్తి కథ వినిపించాడు గౌతమ్. అయితే సెకండ్ హాఫ్‌ అస్సలు బాలేదని తేల్చేశాడు చరణ్‌. అంతే కాదు.. అసలు ఆ దర్శకుడితో సినిమా కూడా ఇప్పట్లో లేదని చెప్పేశాడు. దీంతో మరో దర్శకుడి కోసం వేట మొదలుపెట్టింది నిర్మాణ సంస్థ. ఈ బ్యానర్ కు ముందు నుంచీ దగ్గరగా ఉంటున్న ప్రశాంత్ నీల్ తో చరణ్ సినిమా సెట్ అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు వినిపిస్తోంది.


ఎప్పటి నుంచో పరిశ్రమలో ఉన్నా.. ప్రతిభావంతుడే అన్న పేరు తెచ్చుకున్నా.. ఇప్పటి వరకూ తనదైన ముద్రను బలంగా వేయలేకపోయిన దర్శకుడు వేణు శ్రీరామ్ పేరు తెరమీదికి వచ్చింది.2011లో ఓ మై ఫ్రెండ్ మూవీ తోదర్శకుడుగా పరిచయం అయ్యాడు వేణు. తర్వాత 2017లో మిడిల్ క్లాస్ మెలోడీతో మెప్పించాడు. దీనికి ముందు ఎవడో ఒకడు అనే సినిమా స్టార్ట్అయినా మధ్యలోనే ఆగిపోయింది. చివరగా పవన్ కళ్యాణ్‌ తో వకీల్ సాబ్ రీమేక్ కు దర్శకుడుగా వ్యవహరించాడు. వకీల్ సాబ్ కంటే ముందు దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా ఐకన్ అనే సినిమా అనౌన్స్ అయింది. కానీ ఐకన్ మేటర్ అర్జున్ ఎటూ తేల్చలేదు. ఐకన్ ను వదిలేసి అతను పుష్ప అంటూ అడవుల పట్టుకుని పోయి అద్భుత విజయం అందుకున్నాడు. ఇప్పుడు రెండో పార్ట్ కు రెడీ అవుతున్నాడు. మరి ఖాళీగా ఉన్న వేణు రీసెంట్ గా మైత్రీ వారికి ఓ కథ చెప్పాడనీ.. అది రామ్ చరణ్‌ ఇమేజ్ కు సరిపోయేలా ఉందనీ.. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ చేయబోతున్నారనే న్యూస్ హల్చల్ చేస్తున్నాయి.


నిజానికి రామ్ చరణ్‌ కు కూడా శంకర్ సినిమా కోసం ఇచ్చిన డేట్స్ లో సగానికిపైగా ఖాళీ అయి ఉన్నాయి. అతను చరణ్‌ ను వదిలేసి నెలలో కొన్ని రోజులు భారతీయుడు2 చేస్తున్నాడు కాబట్టి.. చరణ్‌ కు అనివార్యంగా ఆ డేట్స్ ఖాళీ అవుతున్నాయి. అందుకే ఈ కాంబినేషన్ సెట్ చేయబోతున్నారంటున్నారు. మరి వేణు శ్రీరామ్ చెప్పే కథ చరణ్‌ కు నచ్చి ఈ అనెక్స్ పెక్టెడ్ కాంబో సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
.

Related Posts