HomeMoviesటాలీవుడ్అమెరికాలో రికార్డులు సృష్టిస్తున్న అల్లు అర్జున్!

అమెరికాలో రికార్డులు సృష్టిస్తున్న అల్లు అర్జున్!

-

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు నెల రోజుల ముందుగానే నార్త్ అమెరికాలో ‘పుష్ప 2’ బుకింగ్స్ మొదలయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకూ 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో అక్కడ $850 కె వసూళ్లను సాధించింది ‘పుష్ప 2‘. అంటే ట్రైలర్ విడుదలకు ముందే అమెరికాలో ఈ రేంజ్ వసూళ్లను సాధించడం ఓ అరుదైన రికార్డు అని చెబుతున్నారు.

ఇంకా సినిమా విడుదల వరకూ అమెరికాలో ప్రీ సేల్స్ రూపంలోనే ‘పుష్ప 2‘ ఎన్ని మిలియన్ల వసూళ్లను కొల్లగొడుతుందో? అని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. అమెరికాలో డిసెంబర్ 4 నుంచి ‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈరోజు పాట్నా వేదికగా ‘పుష్ప 2‘ ట్రైలర్ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాబోతుంది.

ఇవీ చదవండి

English News