బాలీవుడ్‌లోని ప్రముఖ జంట అయిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల విడాకుల గురించి పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసేలా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి.
సోషల్ మీడియాలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్‌తో విడాకులు తీసుకున్నట్లు చెబుతున్న ఒక ఏఐ వీడియో వైరల్ అయ్యింది. అయితే.. ఇది ఒరిజినల్ కాదని, ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్ ఫేక్ చేసిన వీడియో అని బయటపడింది.
ఐశ్వర్య, అభిషేక్ డివోర్స్ రూమర్స్ లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు డాక్టర్ జిరాక్ మార్కర్. ఐశ్వర్య, జిరాక్ స్నేహితులు. ఇప్పుడు ఆ స్నేహం కొత్త మలుపు తీసుకుందనే ప్రచారం నడుస్తోంది. ఈనేపథ్యంలోనే.. బచ్చన్ కుటుంబం ఐశ్వర్యకు దూరంగా ఉంటోందనేది బాలీవుడ్ టాక్.
ఆమధ్య జరిగిన ముకేశ్ అంబానీ చిన్నకొడుకు వివాహంలోనూ అభిషేక్, ఐశ్వర్య మధ్య మనస్పర్థలు ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. వివాహానికి బచ్చన్ కుటుంబం, ఐశ్వర్య రాయ్ వేర్వేరుగా హాజరైన సంఘటన ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే.. తమ మధ్య మనస్పర్థలు ఉన్నాయని ఐశ్వర్య కానీ.. అభిషేక్ కానీ అధికారికంగా ధృవీకరించలేదు.
మరోవైపు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఏదైనా సమాచారం వాస్తవమే అనుకునే ప్రమాదం పొంచి ఉంది. ఏఐ ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అతి ప్రమాదకరం. ప్రముఖుల ప్రైవేట్ జీవితంలోకి అతిగా జోక్యం చేసుకోవడం సరికాదు అని విశ్లేషకులు చెబుతున్న మాట.