HomeMoviesటాలీవుడ్నటి కస్తూరి అరెస్ట్: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల వివాదం!

నటి కస్తూరి అరెస్ట్: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల వివాదం!

-

తెలుగువారిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా నటి కస్తూరిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు బీజేపీ నాయకురాలుగా ఉన్న కస్తూరి, తన ప్రసంగాల్లో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈసారి తెలుగువారిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.

కస్తూరి తన వ్యాఖ్యల్లో తెలుగువారు తమిళనాడుకు చెలికత్తెలుగా వచ్చి స్థిరపడ్డారని, తమిళనాడు ప్రభుత్వంలో అనేక మంది తెలుగు మంత్రులు ఉన్నారని ఆరోపించారు. అయితే, బ్రాహ్మణులపై మాత్రం తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేక ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ, ఈ విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కస్తూరి వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. విస్తృతంగా విమర్శలు వ్యక్తమవడంతో ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పినప్పటికీ, పలు కేసులు నమోదు అయ్యాయి. కోర్టు ముందస్తు బెయిల్ కూడా నిరాకరించడంతో ఆమె పరారీలోకి వెళ్లి హైదరాబాద్‌లో తలదాచుకుంది. అయితే, ఇటీవల కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆమె ఆచూకీ తెలిసి, తమిళనాడు పోలీసులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆమెను అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి

English News