Akhil : వరుస డిజాస్టర్లు.. అయినా భారీ బడ్జెట్ తో కొత్త సినిమా

అక్కినేని అఖిల్.. నాగార్జున రెండో వారసుడుగా వచ్చాడు. ఇప్పటి వరకూ ఐదు సినిమాలు చేస్తే నాలుగు డిజాస్టర్లు. ఒకటి అబౌ యావరేజ్. కుర్రాడు సినిమా సినిమాకూ మెరుగవుతున్నాడు. చాలా కష్టపడుతున్నాడు కూడా. కానీ లక్ కలిసి రావడం లేదు.

ఇప్పటి వరకూ తనకంటూ ఏ ఇమేజ్ తెచ్చుకోలేకపోయాడు. మరోవైపు తమ ఫ్యామిలీ హీరోలు నాగార్జున, నాగ చైతన్య కూడా ఫ్లాపులు చూస్తున్నారు. ఇలాంటప్పుడు ఏ నిర్మాతైనా సేఫ్ గా వెళ్లాలి అనుకుంటాడు. అఖిల్ లాంటి హీరోతో సినిమా చేయడం అంటే రిస్క్ గా ఫీలవుతారు కూడా.

బట్ యూవీ క్రియేషన్స్ అఖిల్ గతాన్ని పట్టించుకోవడం లేదు. అతని భవిష్యత్ కోసం ధీరంగా ముందుకు వెళుతున్నారు. అందుకే ఎవరూ ఊహించనంత భారీ బడ్జెట్ తో అతను హీరోగా సినిమా చేయబోతున్నారు. అదీ ఓ కొత్త దర్శకుడిని నమ్మి.

అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఏజెంట్ దారుణంగా డిజాస్టర్ అయింది. 80కోట్ల వరకూ కలెక్ట్ చేయాల్సిన ఈ సినిమా 20 కోట్లు కూడా తేలేకపోయింది. అయినా అఖిల్ హీరోగా 100 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయబోతోంది యూవీ క్రియేషన్స్.

అనిల్ కుమార్ అనే ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.ప్రస్తుతం వినిపిస్తోన్నదాన్ని బట్టి ఇదో ప