స్కంద పరమ బోరింగ్ ఇంటర్వ్యూ

ఒక సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ అంటే మాగ్జిమం ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియన్స్.. అఫ్‌ కోర్స్ కథ మొత్తం చెప్పమని కాదు. కనీసం ఆ సినిమాపై ఆసక్తిని పెంచే అంశాలైనా పంచుకుంటారు అని. బట్ చేయక చేయక చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూ పూర్తి చప్పగా సాగుతూ.. అసలెందుకు ఈ ఇంటర్వ్యూ చేశారా అనిపించారు స్కంద హీరో హీరోయిన్. రామ్, శ్రీ లీలతో యాంకర్ సుమ జరిపిన ఇంటర్వ్యూ చూస్తే ఓ పెద్ద సినిమాకు సంబంధించి ఇంత బోరింగ్ ఇంటర్వ్యూ ఈ మధ్య కాలంలో చూడలేదు అనిపిస్తే తప్పేం కాదు. ఆవిడ ఏం అడుగుతుందో.. వాళ్లేం చెబుతున్నారో.. దీని వల్ల సినిమాకు ఒరిగే ఉపయోగం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. సుమా యాంకరింగ్ అంటే గెస్ట్ ల దగ్గర నుంచి మాగ్జిమం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. బట్ ఈ సారి తను కూడా హ్యాండ్సప్ అనేసినట్టుగా ఉంది. నిజానికి ఈ ఇంటర్వ్యూ ప్రోమోనే వీక్ గా ఉంది. దానికి తగ్గట్టుగా పూర్తి ఇంటర్వ్యూ కూడా వెరీ బోరింగ్ అనేలా ఉంది.


హీరో హీరోయిన్లు.. ఒకరి గురించి ఒకరికి ఏం తెలుసు.. పుట్టిన రోజు తారీఖులేంటీ..? షూటింగ్ నుంచి ఇంటికెళ్లాక ఏం చేస్తారు..? ఇవే ప్రశ్నలు అటు తిప్పి ఇటు తిప్పి అడిగేసింది సుమ. వాటికి వాళ్లూ అంతే ఏదో వచ్చాం కాబట్టి చెప్పాలి అన్నట్టుగా మొక్కుబడిగానే ఆన్సర్ చేశారు. సినిమా గురించి, అందులోహైలెట్స్ గురించి ఒక్క ముక్క ఉంటే ఒట్టు. వీళ్లిద్దరు తప్ప మరో పాత్ర, నటుల గురించి ప్రస్తావనే లేదు. తమన్ బానే మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు అని సుమ ఫిక్స్ అయిపోతే రామ్ అంతే కదా అని లైట్ తీసుకుంటే ఇంక ఇంటర్వ్యూలో స్పైస్ ఏముంటుంది..?


ఈ నెల 28న విడుదల కాబోతోందీ స్కంద. ఈ ఇంటర్వ్యూ చూశాక ఖచ్చితంగా సినిమాపై ఒక అంచనాకు రావొచ్చు. మరీ ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వెళితేనే బెటర్. లేదా భారీ అంచనాలతో వెళ్లి వాటిని రీచ్ కాకపోతే అంతకుమించిన డిజప్పాయింట్ అవడం కంటే ఎమ్టీ మైండ్ తో వెళితే శానా మంచిదేమో.

Related Posts