రానా విడుదల చేసిన ‘కీడా కోలా‘ ట్రైలర్

తెలుగు సినిమాని సరికొత్త పంథాలో తీసుకెళుతున్న నవతరం దర్శకుల్లో తరుణ్ భాస్కర్ పేరు కూడా చెప్పుకోవాలి. ‘పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది‘ వంటి సినిమాల తర్వాత దర్శకత్వాన్ని పక్కన పెట్టి రచయితగా, నటుడిగా బిజీ అయిపోయాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే.. మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు తన దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు.

విలక్షణమైన కథలతో పాటు.. విలక్షణమైన టైటిల్స్ తో సినిమాలు చేయడం తరుణ్ భాస్కర్ స్టైల్. ఈకోవలోనే తన లేటెస్ట్ మూవీకి ‘కీడా కోలా‘ అనే వెరైటీ టైటిల్ పెట్టాడు. ఒక కోలాలో కీడా(బొద్దింక) చిక్కుకోవడమే ఈ టైటిల్ కి జస్టిఫికేషన్. ఆమధ్య టీజర్ తో ఆకర్షించిన ‘కీడా కోలా‘ మూవీ ట్రైలర్ ను లేటెస్ట్ గా రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. ఈ సినిమాకి రానా సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నాడు.

’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇంకా.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో మరో పూర్తిస్థాయి పాత్రతో వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా కీ రోల్ చేసినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. క్రైమ్ కామెడీ డ్రామాగా నవంబర్ 3న ‘కీడా కోలా‘ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts