బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనం.. నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇటు టాలీవుడ్ లోనూ, అటు రాజకీయాల్లోనూ పెద్ద కలకలం రేపింది. ఈ రేవ్ పార్టీలో సినీ నటుడు శ్రీకాంత్, నటి హేమ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే.. వీరిలో ఎవరికి వారు తాము రేవ్ పార్టీకి వెళ్లలేదని వీడియోలు రిలీజ్ చేశారు.

కట్ చేస్తే.. బెంగళూరులో రేవ్ పార్టీలో నటీమణి హేమ పాల్గొన్నట్టు పోలీసులు ప్రకటించారు. అలాగే.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా.. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 87 మందికి పాజిటివ్‌గా రిజల్ట్స్ వచ్చినట్టు తెలుస్తోంది

Related Posts