పుష్ప చిత్రానికి చిరంజీవి కనెక్షన్

‘పుష్ప‘ సినిమా కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో ఓ ప్రభంజనమే సృష్టించింది. ‘పుష్ప‘ ఫస్ట్ పార్ట్ ఘన విజయాన్ని సాధించడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే యేడాది ఆగస్టు 15న ‘పుష్ప ది రూల్‘ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈనేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ‘పుష్ప 2‘ షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా.. ఘట్ కేసర్ లోని ఓ థియేటర్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ‘పుష్ప 1‘లో చిరంజీవి నటించిన ‘చూడాలని వుంది‘ సినిమాని చూడడానికి రష్మిక అండ్ బ్యాచ్ వెళతారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ‘ఇంద్ర‘ సినిమా విడుదల సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఉండబోతున్నాయట. చిరంజీవికి అభిమానిగా పుష్పరాజ్ కనిపించబోతున్నాడు. అందుకే.. ‘ఇంద్ర‘ రిలీజ్ సందర్భంగా.. పుష్పరాజ్-యువసేన,తిరుపతి అంటూ బ్యానర్స్ ను కట్టించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు అల్లు అర్జున్. అయినా.. షూటింగ్ ఆపకుండా అల్లు అర్జున్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట సుకుమార్. బన్నీ కూడా ఈరోజు లేదా రేపటి నుంచి షూట్ లో పాల్గొంటాడట.

Related Posts