గేమ్ ఛేంజర్ నుంచి దసరా కానుక

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండడం విశేషం. ఇక.. ‘ఆర్.ఆర్.ఆర్‘తో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

రెండేళ్ల క్రితమే మొదలైన ‘గేమ్ ఛేంజర్‘ తొలుత శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. అయితే శంకర్.. ‘ఇండియన్ 2‘ని ఈ చిత్రాన్నీ సైమల్టేనియస్ గా పూర్తిచేయాల్సి రావడంతో షూటింగ్ డిలే అవుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ విషయంలోనూ నిర్మాత దిల్ రాజు చేతెలెత్తేశాడు. అంతా శంకర్ చేతిలోనే ఉందని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్‘ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుందట. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తమన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. తన సినిమాలకోసం ఎక్కువగా ఏ.ఆర్.రెహమాన్ ని పెట్టుకునే శంకర్.. తమన్ పై నమ్మకంతో ఈ క్రేజీ ఆఫర్ అందించాడు. శంకర్ అంచనాలకు మించిన రీతిలో తమన్ స్వరకల్పన చేస్తున్నట్టు వినిపిస్తోంది. మరి.. ‘గేమ్ ఛేంజర్‘ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ పై త్వరలోనే అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Related Posts