గుంటూరు కారం నుంచి క్రేజీ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూరు కారం‘. ఇప్పటికే ‘అతడు, ఖలేజా‘ వంటి సినిమాలందించిన ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అయితే షూటింగ్ మొదలైనప్పటినుంచీ ఈ సినిమా నత్తనడకన సాగుతూ వచ్చింది. ఎప్పుడైతే.. సంక్రాంతి బరిలో విడుదల తేదీ ఖరారు చేసుకుందో అప్పట్నుంచీ షూటింగ్ లో స్పీడు పెరిగింది.

విడుదలకు ఇంకా మూడు నెలలు సమయం ఉండడంతో అప్డేట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు మేకర్స్. కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ‘గుంటూరు కారం‘ అప్డేట్స్ కావాలి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అవన్నీ ఫలించాయో ఏమో.. ఇప్పుడు దసరా సంరద్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నారట.

అసలు దసరా కానుకగా విడుదల చేస్తారనుకున్న ఫస్ట్ సింగిల్ ను ఈనెల చివరి వరకూ రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తుందట టీమ్. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత నాగవంశీ తెలియజేశారు. మొత్తంమీద.. అటు మహేష్.. ఇటు త్రివిక్రమ్ ఇద్దరితోనూ వరుస సినిమాలు చేస్తున్న తమన్.. ‘గుంటూరు కారం‘కి ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తున్నాడో శాంపుల్ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Posts