‘గుంటూరు కారం’ ట్రైలర్.. మహేష్ బాబు మాస్ ర్యాంపేజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘గుంటూరు కారం’ ట్రైలర్ వచ్చేసింది. ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, రొమాన్స్.. అన్ని అంశాలు పుష్కలంగా జోడించి మాటల మాంత్రికుడు వండిన పర్ఫెక్ట్ మాస్ మాసలా మూవీగా ‘గుంటూరు కారం’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

‘మీ పెద్దబ్బాయిని అనాదలాగ వదిలేశారని అంటున్నారు?..’ అంటూ ఓ విలేకరుల సమావేశంలో రమ్యకృష్ణకు ప్రశ్న ఎదురవ్వడంతో ట్రైలర్ మొదలవుతోంది. ఈ డైలాగ్ ను బట్టే ఈ సినిమాకి మదర్ సెంటిమెంట్ టచ్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఇక.. అక్కడ నుంచి మహేష్ పోషించిన రమణ గాడి మాస్ జాతరను ట్రైలర్ లో ఆవిష్కరించారు. శ్రీలీలతో రొమాన్స్, వెన్నెల కిషోర్ తో కామెడీ.. విలన్లతో చెడుగుడు.. మొత్తంగా మహేష్ బాబు మాస్ ర్యాంపేజ్ తో ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, ఈశ్వరిరావు, రావు రమేష్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్ వంటి భారీ తారాగణమే ఈ సినిమాలో కనిపించబోతుంది. తమన్ సాంగ్స్ తో పాటు బి.జి.ఎమ్. తోనూ అదరగొట్టబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts