ఇండియాలోని మోస్ట్ హ్యాండ్సమ్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకడు. అందంలోనే కాదు ఆన్ స్క్రీన్ పై అదిరిపోయే యాక్షన్ లోనూ చెలరేగిపోతుంటాడు. సిల్వర్ స్క్రీన్ పై మహేష్ చేసే స్టంట్స్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే మహేష్ బాబు లో ఒక్కటే మైనస్ అనేది ఇప్పటివరకూ వినిపించిన మాట. అదేమిటంటే ఆరడగుల ఆజానుభాహుడైన మహేష్.. కండలు తిరిగిన దేహంతో హీమ్యాన్ లో కనిపించాలనేది అభిమానుల కోరిక.

అందుకే ఈసారి హాలీవుడ్ స్టాండార్డ్స్ లో హై వోల్టేజ్ యాక్షన్ లో చెలరేగిపోయేందుకు ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారాడు మహేష్. కండలు తిరిగిన దేహాన్ని పొందేందుకు జిమ్ లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. లేటెస్ట్ గా తాను జిమ్ లో వర్కవుట్ చేస్తోన్న ఓ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. టీ షర్ట్, షార్ట్స్ లో వర్కవుట్ చేస్తున్న ఈ ఫోటోలో 25 ఏళ్ల కుర్రాడిగా హ్యాండ్సమ్ లుక్ లో అదరగొడుతున్నాడు ప్రిన్స్. ఈ ఫోటోలో మహేష్ కండలు తిరిగిన చేయి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఇలాంటి దేహంతో మహేష్ ను చూడలేదు. మహేష్ న్యూ లుక్ పై ఆయన భార్య నమ్రత.. స్పీచ్ లెస్ అంటూ ఫైర్ సింబల్స్ తో కామెంట్ పెట్టింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం‘ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ భాగమే ఉంటుందట. అయితే.. త్రివిక్రమ్ కంటే మిన్నగా రాజమౌళి సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మహేష్ న్యూ మేకోవర్ అవుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. రాజమౌళి సినిమా అంటే యాక్షన్ ఏ రేంజులో ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. తను అనుకున్న అవుట్ పుట్ రావడం కోసం రాజమౌళి హీరోలను ఏ విధంగా కష్టపెడతాడో గత సినిమాల విషయంలో చూశాం. అందుకే.. ముందు జాగ్రత్తగా మహేష్ తన ఫిట్ నెస్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడట. మొత్తంమీద మహేష్ న్యూ లుక్ అయితే అదరగొడుతోంది.