అకీరా అరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్

చిరంజీవి ఫ్యామిలీలో హీరోలకు ఏమాత్రం కొదవ లేదు. ఇప్పటికే ఈ కుటుంబంలో చిరంజీవి, పవన్‌ తో పాటు.. రామ్‌ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీశ్, వైష్ణవ్ తేజ్ వంటి చాలామంది హీరోలున్నారు. ఇక్కడితో మెగా కాంపౌండ్‌ హీరోల పరిచయ వేదిక ఆగిపోతుందంటే పొరపాటే. త్వరలోనే.. ఈ కుటుంబం నుంచి పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ అరంగేట్రానికి కూడా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.

అకీరా ని సినిమాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో కోరుతున్నారు. కానీ.. అకీరా తల్లి రేణు దేశాయ్ మాత్రం తనయుడి సినీ ఎంట్రీ గురించి పాజిటివ్ గా స్పందించిన సందర్భాలు లేవు. అయితే.. లేటెస్ట్ గా రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు‘ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రేణు దేశాయ్.. అకీరా సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం 19 ఏళ్ల అకీరా నందన్.. పియానో, యోగా, మార్షల్ ఆర్ట్స్, రైటింగ్, ఫిలిం ప్రొడక్షన్ అంటూ వివిధ విభాగాలపై శిక్షణ తీసుకుంటున్నాడట. అయితే.. తాను హీరో అవుతాననే విషయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదట. ఒకవేళ తనకు హీరో అవ్వాలనుంటే తల్లిగా తాను కూడా సంతోషిస్తానంటూ.. తనయుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి తన అడ్డు లేదంటోంది రేణు దేశాయ్. మొత్తంమీద.. అకీరా నందన్ డెబ్యూకి సంబంధించి త్వరలోనే మెగా ఫ్యాన్స్‌కి తీపికబురు అందుతుందేమో చూడాలి.

Related Posts