నందమూరి నటసింహ బాలకృష్ణ లేటెస్ట్ సెన్సేషన్ అఖండ. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన అఖండ చిత్రం ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తుందని నమ్మకం ఫస్ట్ నుంచి ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్టే అఖండ అద్భుత విజయం సాధించింది. దీంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా అభిమానులకు ఓ పండగ తీసుకువచ్చిందని చెప్పచ్చు.
అయితే.. బాలయ్య పై కొంత మంది అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో రైతుల సమస్యల గురించి చర్చించడం జరిగింది. అలాగే మైనింగ్ గురించి.. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుందో కళ్లకు కట్టినట్టు చూపించారు.ముఖ్యంగా దేవాలయాలను రక్షించుకోవాలి. ఎంతో పవిత్రంగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే.. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. మేము ఏంటో అంచనాలు లేకుండా హామీలు ఇస్తున్నావ్.. అంచనా వేయడానికి నువ్వు ఏమైనా పోలవరం డ్యామా..? పట్టిసీమ తూమా..? పిల్ల కాలువా..? అంటారు.
ఈ మూవీలో ముందు చెప్పినట్టుగా కొన్ని సమస్యల గురించి చర్చిండం జరిగింది కానీ.. డైలాగులో ఉపయోగించిన పట్టిసీమ సమస్య గురించి ఏం చెప్పకపోవడంతో ఆ ప్రాంతంలోని అభిమానులు బాలయ్య పై ఫైర్ అవుతున్నారని తెలుస్తుంది. పట్టిసీమ సమస్య గురించి కూడా చర్చించి ఉంటే బాగుండేది అంటున్నారు. మరి.. బాలయ్య కానీ.. బోయపాటి కానీ.. స్పందిస్తారేమో చూడాలి.