Advertisement
“”భీమ్లా నాయ‌క్” కోసం “ఎఫ్ 3” త్యాగం*
Latest Movies Trending News

“”భీమ్లా నాయ‌క్” కోసం “ఎఫ్ 3” త్యాగం*

Advertisement

ఏదైనా బిగ్ మూవీ రిలీజ్ డేట్ మారితే.. దాని ప్ర‌భావం త‌ర్వాత వ‌చ్చే సినిమాల పై ఉంటుంది. ఇప్పుడు అదే అయ్యింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, క్రేజీ స్టార్ రానా ద‌గ్గుబాటిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల‌న భీమ్లా నాయ‌క్ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25కి వాయిదా ప‌డింది.

ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ కోసం ఎఫ్ 3 మూవీని ఫిక్స్ చేశారు. అయితే.. ఎఫ్ 3 అనూహ్యంగా భీమ్లా నాయ‌క్ కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. భీమ్లా నాయక్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుని ఫిబ్రవరి 25కు మారడంతో ఆ డేట్ లో రిలీజ్ కావాల్సిన ఎఫ్ 3 ఏప్రిల్ 29 కి మారాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత‌ దిల్ రాజు ఈ రోజు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ప్రెస్ మీట్ లో ప్ర‌క‌టించారు. అంతే కాకుండా.. భీమ్లా నాయ‌క్ రిలీజ్ మారడం వల్ల వరుణ్ తేజ్ సినిమా గని కూడా ఆలోచ‌న‌లో ప‌డింది.

ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాలి అనుకున్న గ‌ని మూవీని మార్చి 18న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. గ‌ని రిలీజ్ ఎప్పుడు అనేది అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయాల్సివుంది. మొత్తానికి భీమ్లా నాయ‌క్ పోస్ట్ పోన్ అవ్వ‌డంతో.. ఎఫ్ 3, గ‌ని సినిమాల పై ఆ ప్ర‌బావం ప‌డింది.

Advertisement