అని ప్రశ్నిస్తున్నారు చాలామంది జనం. మంచు మనోజ్.. మంచు ఫ్యామిలీలో కాస్త డిఫరెంట్ పర్సన్. ఆ డిఫరెన్స్ వల్లే అతని ఫ్యామిలీతో కూడా డిఫరెన్సెస్ వచ్చాయనీ.. అందుకే అతను వారి నుంచి దూరంగా ఉంటున్నాడనే రూమర్స్ కూడా వచ్చాయి. సినిమా పరిశ్రమలో ఘనమైన వారసత్వం ఉన్నా.. దాన్ని కొనసాగించే తెలివి లేక అన్నదమ్ములిద్దరూ వెనకబడి ఉన్నారు. ఇక మంచు లక్ష్మి, విష్ణు అయితే ట్రోలర్స్, మీమర్స్ కు ఆల్వేస్ మంచి స్టఫ్ అవుతారు. కానీ మనోజ్ అలా కాదు. కాస్త తెలివిగా ఉంటాడు. సినిమాలు లేకపోయినా ఇతర విషయాల్లో తన ఫ్యామిలీ మెంబర్స్ లా అతి కనిపించదు. కాస్త వినయంగానే ఉంటాడు. ఈ కారణంగానే మంచు ఫ్యామిలీని ఎవరెంత ట్రోల్ చేసినా.. మనోజ్ అందులో కనిపించడు. మొత్తంగా అలాంటి మనోజ్ పెళ్లి చేసుకుని ఆరు నెలలు కూడా కలిసి లేకుండా విడిపోయాడు. అందుకు కారణాలేవైనా ఆ తర్వాత అతను సింగిల్ గా ఉంటాడు అనుకున్నారు చాలామంది. అలా అనుకున్న వాళ్లందరికీ షాక్ ఇస్తూ రీసెంట్ గా వినాయక మండపంలో భూమా నాగిరెడ్డి కూతురుతో కలిసి కనిపించాడు.

కొన్ని యాధృచ్చికం అనుకుంటాం. బట్ కాదు అని వాళ్లే ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. ఆమెతో ప్రస్తుతం మనోజ్ సహజీవనం కూడా సాగిస్తున్నాడనే ప్రచారం ఉంది. అలాగని తనేమీ సింగిల్ కాదు. పెళ్లైంది. విడాకులు కూడా అయిపోయాయి. దీంతో పాటు ఇప్పుడు ఆమెతో ఓ ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఇద్దరూ సింగిల్ అయితే సెకండ్ మ్యారేజ్ అయినా రిలేషన్ లో ఇబ్బందులు ఉండవు. కానీ మధ్యలో ఉన్న బాబు వల్లే మనోజ్ పెళ్లి విషయం తర్వాత చెబుతా అన్నాడు అనేవారూ ఉన్నారు. అంటే తను ఆమెను పెళ్లి చేసుకోవాలంట ముందు ఆ బాబు మేటర్ తేలాలి. ఆతర్వాతే మూడు ముళ్లు వేయాలి అనుకుంటున్నాడంటున్నారు. మరి బాబు మేటర్ లో నిజమెంత అనేది అప్పుడే చెప్పలేం కానీ.. సడెన్ గా జంటగా కనిపించిన మీడియాకు కావాల్సినంత స్పైస్ అందించాడు మనోజ్.

, , , ,