మామూలుగా ఆఫర్స్ లేని హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేస్తుంటారు. లేదంటే హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. బట్ ఆఫర్స్ ఉన్నా కూడా హాట్ హాట్ గా రెచ్చిపోవడం అనేదిఅరుదుగా చూస్తుంటాం. అయితే సెలబ్రిటీస్ ఏం చేసినా దాని వెనక రీజన్ మరోటి ఉంటుందని అందరికీ తెలుసు. అలాంటి రీజన్స్ తోనే రష్మిక మందన్నా ఇలా రెచ్చిపోతోందా అనే న్యూస్ వస్తున్నాయి. యస్.. ఈ మధ్య రష్మిక మందన్నా ఎప్పుడు చూసినా అరకొరా దుస్తులతోనే కనిపిస్తోంది. ముఖ్యంగా థై షోస్ తో పాటు క్లీవేజ్ షోస్ చేస్తూ అటెన్షన్ అంతా తనవైపే ఉండేలా చేస్తోంది. నిజానికి ఇప్పుడు రష్మిక ఉన్న పొజిషన్ మరీ ఇంతలా ఒంపులారబోయాల్సిన పనిలేదు.

అయినా తనెందుకు అలా చేస్తోందనేది చాలామందికి అర్థం కావడం లేదు.మరోవైపు రష్మిక బాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో పాగా వేయాలనుకుంటోందనీ.. అందుకే ఇదంతా చేస్తోందనీ అనుకుంటున్నారు. ఇదే నిజమైతే ఇంతకంటే ఎక్కువగా అందాలారబోసిన బాలీవుడ్ బ్యూటీస్ ఎవరూ ఫేమ్ కాలేదు. కేవలం తమ సినిమాలు హిట్ అవడం ద్వారాన్నే ఆ ప్లేస్ కు వెళ్లారు తప్ప.. ఇలా అరకొర డ్రెస్ లతో పబ్లిక్ ప్లేస్ లో కూడా అర్థ నగ్నంగా కనిపించడం ద్వారా కాదు. ఇంకా చెబితే ఇలా కనిపించే వారిని బాలీవుడ్ లో సెపరేట్ కేటగిరీలో చూస్తారు.

మరి తనూ ఆ కేటగిరీలోకి వెళ్లాలనుకుంటోందా అంటే తనకు అంత అగత్యం కూడా లేదు. ఎందుకంటే సౌత్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. బాలీవుడ్ లోనూ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. మరి అవసరం లేని చోట కూడా అంత ఎక్స్ పోజింగ్ ఎందుకు చేస్తోందనేది అంతుబట్టడం లేదంటున్నారు సినీజనం. విశేషం ఏంటంటే.. ఇవే విషయాలు నెటిజన్స్ కూడా అడుగుతుంటారు.కొన్ని చోట్ల తను కావాలనే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కు “ఫుటేజ్” ఇస్తోంది. అదంతా తెల్లారేసరికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోతోంది. అంతే తను కావాలనే చేస్తోందనిపిస్తోందంటున్నారు. బాలీవుడ్ లో పాగా వేయాలంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ పనిచేయవు. కాకపోతే కాస్త పరిచయాలు పెరుగుతాయి అంతే.

, , ,