Advertisement
బీస్ట్ హీరోను జైలర్ ను చేశాడు..
Latest Movies Tollywood

బీస్ట్ హీరోను జైలర్ ను చేశాడు..

Advertisement

డైరెక్టర్ అయినా ఫ్లాప్ లు చూశాడంటే పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వడానికి వెనకడతారు.. అనేది ఒకప్పటి మాట. ఏ సినిమా కథ ఆ సినిమాదే అన్నట్టుగా చూస్తున్నారు ఇప్పుడు. గత సినిమా పోయినా ఫర్వాలేదు.. నాకు చెప్పిన కథ ఎలా ఉంది అనేదే ఇప్పుడు క్రైటీరియా అయింది. అందుకే కొత్తతరం దర్శకులు వెంట వెంటనే కొత్త ఆఫర్స్ అందుకుంటున్నారు. మరీ రాడ్ సినిమాలంటే చెప్పలేం కానీ ఫర్వాలేదు.. బాగానే హ్యాండిల్ చేశాడు అన్న పేరొస్తే.. ఫ్లాప్ ఇచ్చినా కూడా తర్వాతి సినిమాకు ఓకే చెబుతున్నారు స్టార్ హీరోలు కూడా. అలా రీసెంట్ గా విజయ్ తో బీస్ట్ అనే హారిబుల్ మూవీ చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ ఛాన్స్ ఇచ్చాడు.

బీస్ట్ కంటే ముందు నెల్సన్ చిన్న సినిమాలు చేశాడు. బలమైన కథాబలం ఉన్న ఆ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందులో ఒకటి నయనతార నటించిన కొలమావు కోకిల కూడా ఉంది. ఈ సినిమా చూశాకే విజయ్ నెల్సన్ కు ఛాన్స్ ఇచ్చాడు. విజయ్ రేంజ్ కు తగ్గ కథ సెట్ చేసుకున్నా.. స్క్రీన్ ప్లే పట్టు తప్పడంతో పాటు అసాధ్యమైన సీన్స్ ను సెట్ చేసుకోవడంతో బీస్ట్ కు ఫస్ట్ షో నుంచి ఫ్లాప్ టాక్ వచ్చేసింది. అయినా విజయ్ కి ఉన్న ఛరిష్మా వల్ల కమర్షియల్ గా ఓకే అనిపించుకుందీ చిత్రం. అయితే బీస్ట్ జరుగుతున్నప్పుడే నెల్సన్ దిలీప్ కుమార్.. సూపర్ స్టార్ రజినీకాంత్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.

బీస్ట్ ఫ్లాప్ కావడంతో రజినీ మళ్లీ ఇతనికి అవకాశం ఇస్తాడా అనుకున్నారు చాలామంది. కానీ ముందే చెప్పినట్టు తన కథ తనదే అన్నట్టుగా చూశాడు సూపర్ స్టార్. అందుకే నెల్సన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి జైలర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి టైటిల్ లుక్ కూడా రిలీజ్ చేశారు. జైలర్ అనేది ఎలా చూసినా పవర్ ఫుల్ టైటిలే. అలాంటి టైటిల్ కు సూపర్ స్టార్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ ను గెలవడం ఏమంత కష్టం కాదు. కాకపోతే ఈ దర్శకుడు మరీ జెట్ ప్లేన్స్ వేసుకుని పాకిస్తాన్ వెళ్లి వచ్చినంత సిల్లీ సీన్స్ కాకుండా కాస్త బలమైన కథనం రాసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది.

Advertisement