యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా లేట్ అయినా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యేడాది క్రితం నుంచి కథ విషయంలో అనేక రూమర్స్ కు కారణమైన ఈ ప్రాజెక్ట్ తో యంగ్ టైగర్ మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాడు. భారీ బడ్జెట్ తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీలో ఇప్పటికే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫైనల్ చేశారు. తనపై చేసిన టెస్ట్ కట్ తో పాటు రిలీజ్ చేసిన ఫోటో స్టిల్ కూడా ఆకట్టుకుంది. ఇక విలన్ గా మొదట్నుంచీ ఓ బాలీవుడ్ యాక్టర్ ను తీసుకోవాలనే అనుకున్నారు. అనుకున్నట్టుగానే నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన సైఫ్ అలీఖాన్ ను ఎన్టీఆర్ కు విలన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ యాక్షన్ సీన్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సెట్స్ లోకి సైఫ్ ఎంట్రీ ఇచ్చాడు.

అందుకు సంబంధించిన ఫోటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మూవీ టీమ్. దీంతో ఎన్టీఆర్ వర్సెస్ సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
నిజానికి ఈ మూవీలో విలన్ గా నటించేందుకు ముందు సైఫ్ అలీఖాన్ ఒప్పుకోలేదు. దీంతో కన్నడ నుంచి సుదీప్ ను తీసుకుంటారు అనే ప్రచారం జరిగింది. మరి ఏమైందో.. సుదీప్ కాకుండా సైఫే ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. ఓ రకంగా ప్యాన్ ఇండియన్ సినిమాకు సైఫ్ లాంటి స్టార్ ఖచ్చితంగా ప్లస్ అవుతాడు. అది సినిమాకు ఎసెట్ అవుతుంది. ప్రమోషన్స్ లో నార్త్ మొత్తం ఎన్టీఆర్ తో పాటు సైఫ్ కూడా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కలిసొస్తుందనే చెప్పాలి. మొత్తంగా లార్జ్ స్కేల్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 2024ఏప్రిల్ 5న విడుదల చేస్తాం అని ప్రకటించింది టీమ్.

, , ,