ఆదిపురుష్‌ డైరెక్టర్ పై సెటైర్స్

చదవేస్తే ఉన్న మతి పోయినట్టుగా అనే సామెత తెలుగులో ఉంది. తీసింది ఒక సినిమా. అది కూడా ఇప్పటి వరకూ ఇండియ్ స్క్రీన్ పై అనేక సార్లు వచ్చిన కథ. ఇంక తెలుగువారు తీసిన సినిమాలకు దేశంలో ఇంకే భాషవాళ్లూ అందుకోలేకపోయారు ఆ స్థాయిని. అలాంటి సినిమా తీసి ఇదే ఫస్ట్ టైమ్ అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నాడు దర్శకుడు ఓమ్ రౌత్. పోనీ ఎంతో కష్టపడి తీసిన సినిమా కాబట్టి ఆ మాత్రం ప్రేమ ఉంటుందని అనుకోవచ్చు. ఆ మేరకు తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు.కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఓమ్ రౌత్ చెప్పిన మాటలకు దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో సెటైర్స్ పడుతున్నాయి.


ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్స్ లో ఒక సీట్ ను ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే రామాయణం ప్రదర్శించే థియేటర్స్ లోకి హనుమంతులవారు వస్తారట. ఆయన కోసం ఒక కుర్చీ ఖాళీగా ఉంచితే ఆయన చూస్తాడట. ఇదీ దర్శకుడు చెప్పిన మాట. ఎంత రామాయణం హిందువులకు గొప్పదే అయినా.. మరీ ఈ స్థాయిలో మాట్లాడాలా అంటూ సోషల్ మీడియాలో ఓమ్ రౌత్ పై సెటైర్స్ పడుతున్నాయి. పైగా అతను ఖాళీ కుర్చీ కోసం కూడా టికెట్ తీసుకోమని చెప్పడం కొసమెరుపు. అంటే ఉదాహరణకు వంద సీట్లు ఉన్నాయంటే ఒక్కొక్కరూ రెండు టికెట్స్ తీసుకుని యాభై సీట్స్ లో కూర్చోవాలి. మిగతాది ఖాళీగా పెట్టాలి. ఇదేదో కరోనా టైమ్ లో ఆర్టీసీ బస్ ల నుంచి అన్ని చోట్లా ఒక కుర్చీని ఖాళీగా వదిలేసి కూర్చోమని చెప్పినట్టుగా ఉందంటున్నారు.


మరోవైపు నా రాముడు నడయాడి నేలపై ఆయన కథను చూడాలంటే టికెట్ కొనాలా.. అంటూ కొందరు సెటైర్స్ వేస్తోంటే.. మొదటి వారం మొత్తం వానరులకు ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలి. ఆ తర్వాతే నరులకు ప్రేవేశం కల్పించాలి అంటున్నారు. ఏదేమైనా ఆదిపురుష్‌ దర్శకుడు ఓమ్ రౌత్ చేసిన ఈ కమెంట్స్ అతనెంత అగ్నానంలో ఉన్నాడు అనేది చెబుతున్నాయంటున్నారు.

Related Posts