సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందించిన సినిమా శాకుంతలం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీకి యూనానిమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చింది. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే ప్రణయ కావ్యం ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. బట్.. అతనే మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఏ వర్గం ప్రేక్షకులను కూడా.. చివరికి సమంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు సైతం ఈ సినిమా నచ్చలేదు. దీంతో మొదటి ఆటకే బొమ్మ తిరగబడింది. అత్యంత భారీ బడ్జెట్ తో గుణశేఖర్ చేసిన రిస్క్ కు ఏ మాత్రం ఫలితం రాలేదు సరికదా.. తీవ్రమైన నష్టాలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో సమంత చేసిన అతి, ప్రేక్షకుల సానుభూతి కోసం తను చేసిన కమెంట్స్ అన్నీ సినిమా రిలీజ్ తర్వాత బూమరాంగ్ అయ్యాయి. సొంత కష్టాలు చెప్పుకుంటే బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాదు అని తేల్చారు ఆడియన్స్.


మరోవైపు మొదటిసారిగా సమంత నటనపైనా విమర్శలు వచ్చాయి. ఏ ఫ్రేమ్ లోనూ తను కాళిదాసు శాకుంతంలా కనిపించలేదు అన్నారు. నటన పరంగా చాలా మైనస్ లు చూపించారు. ఫస్ట్ హాఫ్ లో ఆమె ఫేస్ లో అసలు కళే లేదు. గ్రేస్ కనిపించలేదు. యాక్టివ్ గా లేదు.. ఇలా రకరకాల కమెంట్స్ వచ్చాయి. మరి ఇవన్నీ తనకు చేరకుండా ఉండవు కదా. అందుకే లేటెస్ట్ గా ఇన్ స్టా వేదికగా తను రియాక్ట్ అయింది. ఇందులో భగవత్ గీతలోని శ్రీకృష్ణ శ్లోకాన్ని పెట్టింది.“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి ’’.. ఇదీ సమంత షేర్ చేసిన భగవత్ గీతలోని సంస్కృత శ్లోకం. అంటే దీనర్థం .. నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి”అని. సో.. అమ్మడికి డిజాస్టర్ పడగానే గీత గుర్తొచ్చిందన్నమాట.

, , ,