ప్చ్ .. సెకండ్ ట్రైలర్ రాకుండా ఉండాల్సింది.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలింగ్

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ‘ఆదిపురుష్‌’. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 16న విడుదల కాబోతోంది. లేటెస్‌ గా మంగళవారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ ఆసాంతం సినిమా ప్రమోషన్స్ లా కాకుండా కేవలం హిందూత్వ ఎజెండాను ప్రమోట్ చేస్తున్నట్టుగానే కనిపించిందని అంతా చెప్పుకుంటున్నారు.

సరే అలా చెప్పేవారు కావాలనే అంటున్నారు అనుకున్నా.. ఈ ఆదిపురుష్‌ సెకండ్ ట్రైలర్ తో మళ్లీ డ్యామేజ్ జరిగింది అని సగటు ప్రభాస్ అభిమానులంతా ఫీల్ అవుతున్నారు అనేది నిజం. పైగా సినిమా అంతా కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ పైనే ఆధారపడింది అని గెస్ట్ లు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అర్థమైంది. అంటే ఫ్యాన్స్ చూస్తే తప్ప వర్కవుట్ కాదు. వాళ్లు ఎలా ఉన్నా బానే ఉందని హైప్ చేయాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి అన్నట్టుగా సాగింది మొత్తం ప్రహసనం అంతా.


మొదట వచ్చిన టీజర్ కే ఎంటైర్ కంట్రీ భయపడిపోయింది. ఇదే సినిమా అనుకున్నారు. దీంతో మళ్లీ సినిమా అంతా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ చేయించారు. ఈ సారి బానే ఉందని చెప్పేందుకు ఆ మధ్య ఓ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూశాక అప్పటి వరకూ ఏ మాత్రం ఆసక్తి లేని వాళ్లు కూడా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. రాముడి కథ చూడాలి అని ఫిక్స్ అయ్యారు. బట్ లేటెస్ట్ గా విడుదల చేసిన ”యాక్షన్ ట్రైలర్”చూశాక ఫస్ట్ టీజర్ తోనే కంపేర్ చేస్తున్నారు. ఆ రేంజ్ లో ఉందీ సెకండ్ ట్రైలర్. ఎమోషన్ కంటే ఎక్కువగా విఎఫ్ఎక్స్ డామినేట్ చేస్తున్నాయి. ట్రైలర్ మొత్తం కార్టూన్ ను తలపిస్తోంది.

ఇక డైలాగ్స్ కూడా ఏమంత బాలేవు. క్లైమాక్స్ లో వానర సైన్యంలో ప్రభాస్(అదేలే రాముడు) ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్న ఈ డైలాగ్స్ లో తెలుగు నేటివిటీ పూర్తిగా మిస్ అయింది. ఇక పూర్తిగా లంకపై యుద్ధం నేపథ్యంలో కనిపించిన ఈ రెండో ట్రైలర్ సినిమాకు ప్లస్ కంటే ఎక్కువగా మైనస్ అయిందనే చెప్పాలి. దీంతో అసలు ఈ ట్రైలర్ విడుదల చేయకుంటే బావుండేది ఫ్యాన్స్ అంతా ఫీలవుతున్నారు. ఏదేమైనా ఈ చిత్రాన్ని హిందువులంతా చూడాల్సిందే అన్నట్టుగా సాగుతోంది మొత్తం వ్యవహారం. ఒకవేళ ఆదిపురుష్ చూడకపోతే వాళ్లు హిందువులే కాదు అని కూడాచెప్పేందుకు ఏ మాత్రం సందేహించనట్టుగా ఉన్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ.. ఈ రెండో ట్రైలర్ మాత్రం డామేజింగ్ గానే ఉంది.

Related Posts