‘ఓ.జి’సెట్ లో పవన్ కళ్యాణ్.. ఏంటి ఈ దూకుడు..?

మొన్నటి వరకూ సరైన టైమ్ లో షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేయకుండా చాలా సినిమాలు లేట్ అయ్యేందుకు కారణమయ్యాడు పవన్ కళ్యాణ్. ఆ టైమ్ లో పొలిటికల్ గా బిజీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అని అందరికీ తెలుసు. ఆ కారణంగానే హరిహర వీరమల్లు ఈ సమ్మర్ కు రిలీజ్ కాకుండా పోయింది. అయితే ఆ తర్వాత ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం లేట్ చేయడం లేదు పవర్ స్టార్. ఇప్పటికే తమిళ్ రీమేక్ వినోదాయ సీతమ్ మూవీకి సంబంధించి తన పార్ట్ మొత్తం షూటింగ్ అయిపోయింది. తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ స్టార్ట్ చేశాడు. దీనికోసం కూడా ఇప్పటికే దాదాను రెండు వారాల టైమ్ ఇచ్చి పూర్తి చేశాడు. ఈ టైమ్ లో పోలీస్ స్టేషన్ సీన్స్, ఓ ఫైట్ తో పాటు కొన్ని కామెడీ సీన్స్ ను కూడా చిత్రీకరించారు. ఇక లేటెస్ట్ గా ఓ.జి సెట్ లోకి ఎంటర్ అయ్యాడు.

రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం ఇది. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని చెబుతున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో మొదలైంది. అక్కడే వందమందికి పైగా ఫైటర్స్ తో చిత్రీకరణ చేయబోతున్నారు.

ఈ షూట్ లో పవన్ కళ్యాణ్ ఏకధాటిగా ఒక వారం రోజుల పాటు పాల్గొంటాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓజి గ్లింప్స్ లో ఒక పేజ్ లో చూపించిన సీన్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారు. మరోవైపు ఓజి తర్వాత హరిహర వీరమల్లు టీమ్ ను కూడా కరుణించాడని టాక్. వారికోసం మరో వారం కేటాయించాడట. సో.. చూస్తోంటే పవన్ దూకుడు డబుల్ అయింది. మరి ఈ స్పీడ్ సినిమాలు కూడా పూర్తయ్యేంత వరకూ ఉంటుందా లేదా అనేది చూడాలి.

Related Posts