దుబాయ్ లో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’

తెలంగాణ ప్ర‌భుత్వం స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 వేడుక‌లు దుబాయ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌. ఇందులో భాగంగా సోమవారం దుబాయిలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఉత్తమ్ చంద్ గారిని మర్యాద పూర్వకంగా కలసి నంది అవార్డ్స్ వేడుకకు రావలసిందిగా ఆహ్వానించారు. ఉత్తమ్ చంద్ గారు టి యఫ్ సి సి నంది అవార్డ్స్ వేడుక సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈరోజు దుబాయిలో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ బ్రాంచ్ కార్యాలయం ప్రారంభించారు. బుర్జ్ ఖలీఫా ప్రక్కన ఉన్న లేక్ వ్యూ బిల్డింగ్ లోని 19వ ఫ్లోర్ లో ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ దుబాయిలో చాలా మంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన టెక్నిషియన్స్ వున్నారు. వారందరి కోరిక మేరకు మన ఛాంబర్ ఏర్పాటు చేయడమైనది. దుబాయిలో ఛాంబర్ ఇంఛార్జీలుగా రవికుమార్ సింగిరి, ప్రకాశ్ నాగ్ గార్లు భాద్యతలు స్వీకరించారు.

ప్రకాష్ నాగ్ టి.మా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. త్వరలో దుబాయిలో టి ఎఫ్ సి సి నంది అవార్డ్స్ వేడుక భారీ స్థాయిలో నిర్వహించబోతున్నాం. ఈ బాధ్యతల్ని వీరిరువు తీసుకున్నారు. దుబాయిలో తెలుగు సినిమా షూటింగ్స్ చేసుకోవాలనుకొనే నిర్మాత దర్శకులు రవికుమార్, ప్రకాష్ నాగ్ గార్లను సంప్రదించవచ్చు. చాంబర్ తరపున షూటింగ్ పర్మిషన్స్, లొకేషన్ ఏర్పాట్ల విషయంలో సహకారం అందిస్తారు అన్నారు. ఇంకా సినీ నిర్మాత సత్యనారాయణ,రైటర్ విద్య, సింగర్ రాకేష్, అబ్దుల్లా, సుధాకర్, సహకారం మరువలేనిది. వారు కూడా ఎంతగానో సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టిమా ప్రెసిడెంట్ రష్మీ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts