Sumanth prabhas : సినిమా ఎలా ఉన్నా.. కుర్రాడు ఫేమస్ అయిపోయాడు

మన డబ్బా కొట్టడానికి ఎవరూ లేనప్పుడు మన డబ్బా మనమే కొట్టుకోవడంలో తప్పే లేదు అని ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలా ఇప్పుడు స్వయంకృషితో ఎదిగే ప్రయత్నంలో తన డబ్బా తనే కాదు.. ఇతరులతోనూ కొట్టించడంలో సూపర్ సక్సెస్ అవుతున్నాడు కొత్త కుర్రాడు సుమంత్ ప్రభాస్.

అలాగని ఇదేమీ నెగెటివ్ సెన్స్ లో చెప్పడం లేదు. నిజంగానే కుర్రాడు తన ఫస్ట్ మూవీ కోసం ఓ రేంజ్ లో కష్టపడుతున్నాడు. చాయ్ బిస్కట్ సౌజన్యంతో నిర్మించిన “మేం ఫేమస్” అనే చిత్రానికి తనే హీరో దర్శకుడు కూడా కావడం విశేషం. చిన్న వయసులోనే అదీ ఫస్ట్ మూవీతోనే పెద్ద బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీస్ తో ఈ మూవీని ప్రమోషన్ చేయిస్తున్నాడు. వాడటం మొదలుపెడితే నన్ను మించి ఎవరూ వాడలేడు అన్నట్టుగా నాని నుంచి సుమ వరకూ వాడేశాడు.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, అడవి శేష్‌, అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్, విజయ్ఆంటోనీ, హరీష్‌ శంకర్ ఇలా దర్శకులు, హీరోలు ఆర్టిస్టులు అందరినీ తన మూవీ ప్రమోషన్ కు ఒప్పించడమే కాదు.. అందరి చేతా ఒకే పేట్రన్ లో డైలాగ్ చెప్పిస్తూ ఫస్ట్ మూవీతోనే ఫేమస అయిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వీరందరికంటే ముందు అతన్ని అందరికీ తెలిసేలా చేసింది మంత్రి మల్లారెడ్డి.


మల్లారెడ్డి ఎప్పుడైతే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడో అప్పటి నుంచీ మేం ఫేమస్ మూవీ ఆడియన్స్ లోనే ఉండటం విశేషం. ఇక ట్రైలర్ చూసిన తర్వాత జాతిరత్నాలు ఫ్లేవర్ కనిపించినా.. అక్కడక్కడా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీలా అనిపించినా.. సుమంత్ ప్రభాస్ చేసిన ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగ్గది.

ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. కుర్రాడు మాత్రం ఆల్రెడీ ఫేమస్ అయిపోయాడు. అన్ని ఈవెంట్స్ లోనూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఏదేమైనా సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అనే ఇంగ్లీష్ సామెత ఈ కుర్రాడిని చూస్తే మరోసారి గుర్తొస్తోంది కదూ..?

Related Posts