విజయ్ కి తెలుగు దర్శకుల దమ్మేంటో తెలిసిందా..?

కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తననుంచి వచ్చే బిలో యావరేజ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మాగ్జిమం కలెక్షన్స్ సాధిస్తుంది. ఇక హిట్ టాక్ వస్తే రికార్డులు బద్ధలే అవుతాయి. తమిళ్ లో అతనికి తిరుగులేని క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను తెలుగులోనూ పెంచుకునే ప్రయత్నం కొన్నాళ్లుగా చేస్తున్నాడు. అది వర్కవుట్ అవుతుంది కూడా. అయితే ఇంకా పెంచుకునేందుకు ఏకంగా తెలుగు దర్శకుడితోనే సినిమా చేశాడు. దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ఆ చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్ అయినా తమిళ్ లో మాత్రం ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే అక్కడ కొత్త కంటెంట్ ఏం లేదు. కేవలం విజయ్ ఇమేజ్ తో సాధ్యమైన ఫీట్ ఇది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘లియో’అనే సినిమా చేస్తున్నాడు విజయ్.

ఆ తర్వాత అట్లీతో ఓ మూవీ ఉంటుందన్నారు. బట్ అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే మూవీ చేస్తున్నాడు. దీనికి కొంత ఎక్కువ టైమ్ పట్టేలా ఉందట. ఆ టైమ్ ను తెలుగు దర్శకుడికి ఇవ్వాలనుకుంటున్నాడట విజయ్. మరి ఆ తెలుగు దర్శకుడు ఎవరో తెలుసా.. గోపీచంద్ మలినేని.
రవితేజతో క్రాక్ వంటి సూపర్ హిట్ ఇచ్చి.. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణకు వీర సింహారెడ్డి వంటి హిట్ అందించాడు. వీర సింహారెడ్డి కూడా రొటీన్ కథే అయినా.. తనదైన ట్రీట్మెంట్ తో పూర్తిగా బాలయ్య ఇమేజ్ ను క్యారీ చేస్తూ తెలివిగా గేమ్ ఆడాడు గోపీచంద్. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవడమే కాదు..

లేటెస్ట్ గా వంద రోజుల పోస్టర్ కూడా వేసుకుంది. అంటే ఎన్ని కేంద్రాల్లో అని మాత్రం అడగొద్దు. ఇక అలాంటి దర్శకుడు రీసెంట్ గా విజయ్ కి కథ చెప్పాడనే ప్రచారం జరగడం.. దానికి విజయ్ కూడా సానుకూలంగా ఉండటం అనే వార్తలు షికార్లు చేశాయి. ఇంకేం.. ఈ క్రేజీ కాంబినేషన్ లో త్వరలోనే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతోందనేది కోలీవుడ్ అండ్ టాలీవుడ్ టాక్. మరి ఈ టాక్ ఎప్పుడు నిజం కాబోతోందో చూడాలి. ఏదేమైనా ఫస్ట్ టైమ్ తెలుగు దర్శకుడితో చేసిన వారసుడు డిజాస్టర్ అయినా మనోళ్ల టేకింగ్ పవర్ కు విజయ్ కూడా ఫిదా అయినట్టున్నాడు.

Related Posts