Thamanna : బాబోయ్.. తమన్నా ఏంటీ ఈ రేంజ్ లో రెచ్చిపోయింది.. ?

తమన్నా భాటియా.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనంత హాట్ హాట్ నటించిందంటే చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. ఈ పదిహేనేళ్లలో తమిళ్ తో పాటు తెలుగులోనూ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది తమన్నా.

గ్లామర్ విషయంలో ఎప్పుడూ పెద్దగా హద్దులు పెట్టుకోలేదు కానీ.. మరీ ఈ రేంజ్ లో అందాలారబోత మాత్రమే కాక ఇంటిమేట్ సీన్స్, బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటూ ఎప్పుడూ చేయలేదు. మరి ఇంత సడెన్ గా తమన్నా ఇలాంటి సిరీస్ లో నటించాడానికి కారణం ఏంటో కానీ.. తనను ఇలా చూసిన ఫ్యాన్స్ మాత్రం తెగ హర్ట్ అయిపోతున్నారు. అయినా ఇప్పుడేమంత అవసరం వచ్చిందని ఇలాంటి సిరీస్ లో నటించాలి అని ఇంకొందరు ఫ్యాన్స్ ఏకంగా తిడుతున్నారు కూడా.

యస్.. తమన్నా అమెజాన్ ప్రైమ్ లో “జీ కర్దా” అనే వెబ్ సిరీస్ లో నటించింది. అరుణిమ శర్మ డైరెక్ట్ చేసిన సిరీస్ ఇది. విశేషం ఏంటంటే.. ఈ సీరీస్ లో తనే ప్రధాన పాత్రధారి. అలాగని ఇదేదో యాక్షన్ ఎంటర్టైనర్ కాదు. కొంతమంది స్కూల్ మేట్స్ కథ. స్కూల్ డేస్ నుంచి కలిసి ఉన్న ఒక బ్యాచ్ పెద్దయ్యేంత వరకూ ఆ బాండ్ ను అలాగే కంటిన్యూ చేస్తారు. అందులో మెయిన్ పర్సన్ అయిన లావణ్య(తమన్నా) కు ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతనితో అన్నీ కానిచ్చేస్తుంది. ఏకంగా కొన్నిసార్లు అబార్షన్స్ కూడా అవుతాయి(అని తన పాత్రే ఓ సారి చెబుతుంది).

అలాంటి అమ్మాయికి తన స్కూల్ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకతను ప్రపోజ్ చేస్తాడు. కట్ చేస్తే ఆ పెళ్లికి తను ఒప్పుకుంటుంది. కానీ తన వ్యవహారం తెలిసిన మరో ఫ్రెండ్ అడిగితే పెళ్లి తర్వాత సెక్స్ కేవలం పిల్లల కోసమే.. ముందు సెక్స్ సంతోషం కోసం అని చెప్పి షాక్ ఇస్తుంది. ఇక ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఫిజికల్ రిలేషనే కానీ.. మెంటల్ రిలేషన్ ఉండదు. అందుకే అతను ఆమె పెళ్లికి వస్తాడు. పెళ్లిలో అందరి ముందే కౌగిలించుకోవడం ముద్దుపెట్టడం లాంటివి చేస్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆమెను తన స్కూల్ మేట్ పెళ్లి చేసుకున్నాడా లేదా..? ఏ దశలో అయినా లావణ్య రియలైజ్ అయ్యిందా లేదా అనేది సిరీస్ లో చూడాలి.


బట్ ఈ “జీ కర్దా” ట్రైలర్ విడుదలైన దగ్గర్నుంచీ వైరల్ గా మారింది. ముఖ్యంగా తమన్నాను ఇలా చూసి చాలామంది షాక్ అవుతున్నారు. ఏదో బి గ్రేడ్ ఆర్టిస్టులు చేసిన పాత్రలా ఉంది. నిజానికి చేతిలో ఏ ఆఫర్ లేని మాజీ గ్లామర్ హీరోయిన్లు చేయాల్సిన పాత్రలా కనిపిస్తోంది తమన్నా చేసిన పాత్ర.

మరి తను ఎందుకు ఒప్పుకుందో కానీ.. కెరీర్ క్లైమాక్స్ లో తను ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీకి కూడా గట్టి షాకే ఇచ్చిందని చెప్పొచ్చు.

ఇంకా చెబితే వెబ్ సిరీస్ లలో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి దేనికైనా రెడీ అని చెప్పేందుకే ఇలా ఫస్ట్ అటెంప్ట్ లోనే అంత హాట్ గా కనిపించిందా అనేవారూ లేకపోలేదు. ఏదేమైనా తమన్నాను విపరీతంగా అభిమానించినవారంతా ఇప్పుడు షాక్ లో ఉన్నారనే చెప్పాలి.

Related Posts