రెండు మూడేళ్లుగా బాలీవుడ్ లో జెండా ఎగురవేయాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది రష్మిక మందన్నా(Rashmika Mandanna). ఈ క్రమంలో ఉన్న ఆఫర్స్ పోతున్నా పట్టించుకోవడం లేదీ కాంట్రవర్శీయల్ క్వీన్.

అఫ్ కోర్స్ బాలీవుడ్(Bollywood) డ్రీమ్స్ లో ఉన్నప్పుడు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందనుకోండి. అందువల్లే పూజాహెగ్డే(Pooja Hegde)కు తెలుగులో సినిమాలు లేకుండా పోతున్నాయి. మరి అదేం చిత్రమో కానీ.. రష్మిక మందన్నా ఇప్పటి వరకూ బాలీవుడ్ లో చేసిన మూడు సినిమాలూ పోయాయి. అయినా అమ్మడికి కొత్త ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. వీటిలో ఆల్రెడీ సైన్ చేసిన యానిమల్(Animal) మూవీ కూడా ఉంది. రణ్‌బీర్ కపూర్(Ranbeer Kapoor) హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకుడు.

ఈ మూవీతో రష్మికకు బాలీవుడ్ లో స్టార్ తిరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. అయితే యానిమల్ రిలీజ్ అయ్యే వరకూ అమ్మడికి అక్కడ కొత్త ఆఫర్స్ రావు అనుకున్నవారికి తాజాగా షాక్ ఇచ్చింది.
తను చేసిన మూడు బాలీవుడ్ సినిమాలూ పోయినా.. లేటెస్ట్ గా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది శ్రీ వల్లి(Sri Vali). అది కూడా షాహిద్ కపూర్(Shahid Kapoor) సరసన. అనీస్ బజ్మీ డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రంలో షాహిద్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంటే మరో హీరోయిన్ కూ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు రష్మిక మందన్నా సెకండ్ హీరోయిన్ అవుతుందా లేక మెయిన్ హీరోయినేనా అనేది తెలియాలి.


ఇక ఇటు తెలుగులో పుష్ప2(Pushpa the Ruling) ది రూలింగ్ రెడీ అవుతుంది. అలాగే తెలుగులో తనను పరిచయం చేసిన వెంకీ కుడుముల సినిమా కూడా ఉంది. నితిన్(Nitin) హీరోగా నటిస్తోన్న సినిమా ఇది. అలాగే రెయిన్ బో(Rainbow) అనే మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీ కూడా రీసెంట్ గా స్టార్ట్ అయింది.

మరి వీటి కంటే తను ఎక్కువగా బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. మరి ఆ ఫోకస్ కు తగ్గ లైమ్ లైట్ వస్తుందా లేదా అనేది చూడాలి.

, , , , , , , , , , ,