బాలీవుడ్ కు సాలిడ్ హిట్ పడింది

కరోనా తర్వాత నుంచి సాలిడ్ సక్సెస్ కోసం బాలీవుడ్ నానా తంటాలు పడుతోంది. అక్కడి టాప్ స్టార్స్ అంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా బిగ్గెస్ట్ హిట్ అనే టాక్ రావడానికి చాలా టైమ్ పట్టింది. చివరికి షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ తో ఆ మాట విన్నారు. అంతకు ముందు కొన్ని సినిమాలు విజయం సాధించినా అంత పెద్ద సౌండ్ రాలేదు.

పఠాన్ తో ఇక అంతా మామూలు అయిపోతుంది అనుకుంటే మళ్లీ హిందీ సినిమాలకు హిట్స్ లేకుండా పోయాయి. బట్ పఠాన్ వచ్చిన ఇన్నాళ్లకు ఓ సాలిడ్ హిట్ పడింది. అది కూడా చిన్న సినిమా కావడ విశేషం. ‘జరా హట్ కే జరా బచ్ కే’ అనే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. విశేషం ఏంటంటే.. అక్షయ్ కుమార్ లాంటి హీరోలకే మినిమం ఓపెనింగ్స్ రాని టైమ్ లో ఈ చిత్రానికి ఫస్ట్ డే ఏకంగా 5.49 కోట్లు మొదటి రోజు వచ్చాయి.

సినిమా బావుండటంతో రివ్యూస్ తో పాటు మౌత్ టాక్ కూడా పెరిగింది. దీంతో రెండో రోజు 7.20 మూడో రోజు 9.90 కోట్ల కలెక్షన్స్ తో మూడు రోజుల్లోనే ఫస్ట్ వీకెండ్ కు 22. 59 కోట్లు వసూళ్లు వచ్చాయి. మామూలుగా రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయంటే వీక్ డేస్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందనే అర్థం. పైగా ఈ చిత్రానికి ఇప్పుడు పెద్దగా పోటీ కూడా లేదు. దీంతో ఫుల్ రన్ లో 75 కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.


ఇక ‘జరా హట్ కే జరా బచ్ కే’ అంటే జాగ్రత్తగా పక్కకు తప్పుకో అని అర్థం. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకుడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈమూవీతో బాలీవుడ్ కు చాలా రోజుల తర్వాత ఓ సాలిడ్ హిట్ పడినట్టే అని చెప్పాలి.

Related Posts